గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో కోలాటం
Sakshi Education
తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మార్చి 8న నిర్వహించిన సామూహిక మహిళా కోలాట ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు లభించింది.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని గోదావరిఖని సింగరేణి జీఎం కార్యాలయ గ్రౌండ్‌లో 714 మందితో ఈ సామూహిక కోలాటం నిర్వహించారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. గిన్నిస్‌బుక్ ఆఫ్ రికార్డు సర్టిఫికెట్, మెడల్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌కు చీఫ్ కోఆర్డినేటర్ రంగజ్యోతి అందజేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోలాట ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
ఎప్పుడు : మార్చి 8
ఎక్కడ : గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోలాట ప్రదర్శనకు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు
ఎప్పుడు : మార్చి 8
ఎక్కడ : గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ
Published date : 09 Mar 2019 05:32PM