Skip to main content

గిగా మెష్‌ సాధనాన్ని అభివృద్ధి చేసిన అంకుర సంస్థ?

గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాలకు తీగలు లేకుండానే నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను తక్కువ ధరకే అందించేందుకు ఆస్ట్రోమ్‌ అనే అంకుర పరిశ్రమ ‘గిగా మెష్‌’ సాధనాన్ని అభివృద్ధి చేసింది.
Current Affairs
దానికి భారత్, అమెరికాల నుంచి పేటెంట్‌ లభించింది. 2018 ఏడాదిలో ఆస్ట్రోమ్‌.. మిల్లీమీటరు వేవ్, మల్టీబీమ్‌తో కూడిన ఒక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసింది. దీనికి మనదేశంతోపాటు అమెరికా నుంచి పేటెంట్‌ లభించింది. ఆ తర్వాత దీన్ని మరింత మెరుగుపరచి గిగా మెష్‌ పేరుతో ఒక సాధనాన్ని ఆస్ట్రోమ్‌ అభివృద్ధి చేసింది.

గిగా మెష్‌ సాయంతో గ్రామాల్లో నాణ్యమైన, అధికవేగం కలిగిన టెలికం మౌలిక వసతులను.. ప్రస్తుతమున్నదానితో పోలిస్తే ఐదు రెట్లు తక్కువ ఖర్చుతో సాకారం చేయవచ్చు.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
గిగా మెష్‌ సాధనాన్ని అభివృద్ధి చేసిన అంకుర సంస్థ?
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : ఆస్ట్రోమ్‌ అనే అంకుర సంస్థ
ఎందుకు : గ్రామాలు, పట్టణ శివారు ప్రాంతాలకు తీగలు లేకుండానే నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్‌ సేవలను తక్కువ ధరకే అందించేందుకు
Published date : 31 Mar 2021 11:21AM

Photo Stories