గగన్‌యాన్ తొలిదశ ఎంపిక పూర్తి
Sakshi Education
భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో చేపట్టనున్న మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’లో పాల్గొనే వ్యోమగాముల కోసం చేపట్టిన ఎంపిక ప్రక్రియ తొలిదశ పూర్తయింది.
ఈ విషయాన్ని భారత వాయుసేన(ఐఏఎఫ్) సెప్టెంబర్ 6న తెలిపింది. గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా 2021 డిసెంబర్ కల్లా రెండు మానవరహిత, ఓ మానవసహిత అంతరిక్ష యాత్రను చేపట్టాలని ఇస్రో నిర్ణయించిన సంగతి తెలిసిందే.
గగన్‌యాన్‌లో భాగంగా నలుగురు భారతీయ వ్యోమగాములకు(వ్యోమనాట్స్) రష్యాలోని యూరీగగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో 15 నెలలపాటు శిక్షణ ఇవ్వనున్నారు. చివరగా వీరిలో ముగ్గురు వ్యోమగాములు గగన్‌యాన్‌లో భాగంగా అంతరిక్షంలో 7 రోజుల పాటు గడపనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.10,000 కోట్లను కేటాయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : గగన్‌యాన్ తొలిదశ ఎంపిక పూర్తి
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : భారత వాయుసేన(ఐఏఎఫ్)
ఎందుకు : గగన్‌యాన్ ప్రాజెక్టులో భాగంగా

Published date : 07 Sep 2019 05:34PM