గాంధీ శాంతి బహుమతి–2020ని ఎవరికి ప్రదానం చేయనున్నారు?
Sakshi Education
ప్రతిష్టాత్మక గాంధీ శాంతి బహుమతిని 2020 సంవత్సరానికి గాను బంగబంధు, బంగ్లాదేశ్ జాతిపిత, దివంగత షేక్ ముజీబుర్ రెహ్మాన్‌కు ప్రదానం చేయనున్నారు.
అలాగే గాంధీ శాంతి బహుమతి–2019ను దివంగత ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయీద్ అల్ సయీద్‌కు ప్రదానం చేయనున్నారు. ఈ విషయాన్ని మార్చి 22న కేంద్ర సాంస్కృతిక శాఖ వెల్లడించింది. ఇండియా–ఒమన్ మధ్య సంబంధాలను బలోపేతం చేయడంతోపాటు గల్ఫ్ ప్రాంతంలో అహింస, శాంతి కోసం సాగించిన నిర్వరామ కృషిని గుర్తిస్తూ సుల్తాన్ ఖబూస్‌కు ఈ బహుమతిని ఇస్తున్నట్లు పేర్కొంది. రెహ్మాన్ బంగ్లాదేశీయులకే కాదు భారతీయులకు కూడా ఒక హీరో అని ప్రధాని మోదీ కొనియాడారు.
గాంధీ శాంతి బహుమతి...
భారత జాతిపిత మహాత్మగాంధీ గౌరవార్థం భారత ప్రభుత్వం ఏటా ఈ అవార్డును అందజేస్తుంది. గాంధీ 125వ జయంతిని పురస్కరించుకొని 1995లో ఈ అంతర్జాతీయ అవార్డును ఏర్పాటుచేసింది. గాంధీ అనుసరించిన మార్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ తదితర రంగాల్లో విశేష మార్పులకు కారణమైన వ్యక్తులకు, సంస్థలకు ఈ అవార్డును ప్రదానం చేస్తారు. దేశం, భాష, లింగం, జాతి తారతమ్యం లేకుండా ఎవరైనా ఈ అవార్డుకు అర్హులే.
ఎంపిక...
భారత ప్రధానమంత్రి నేతృత్వంలోని ఎంపిక కమిటీ అవార్డు విజేతలను ఎంపిక చేస్తుంది. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మరో ఇద్దరు ప్రముఖులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. 1995లో మొదటిసారిగా ఈ అవార్డును టాంజానియా తొలి అధ్యక్షుడు జూలియస్ న్యెరేరేకు ప్రదానం చేశారు. అవార్డు కింద రూ. కోటి నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక అందజేస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2019, 2020 ఏడాదికిగాను గాంధీ శాంతి బహుమతి విజేతలు
ఎప్పుడు : మార్చి 22
ఎవరు : దివంగత ఒమన్ సుల్తాన్ ఖబూస్ బిన్ సయీద్ అల్ సయీద్(2019), బంగ్లాదేశ్ జాతిపిత, దివంగత షేక్ ముజీబుర్ రెహ్మాన్(2020)
ఎందుకు : గాంధీ అనుసరించిన మార్గాల్లో సామాజిక, ఆర్థిక, రాజకీయ తదితర రంగాల్లో విశేష మార్పులకు కారణమైనందున

Published date : 23 Mar 2021 06:22PM