గాంధీ మృణ్మయ కుడ్యచిత్రం ఆవిష్కరణ
Sakshi Education
ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం(ఎన్‌డీఎంసీ)లో ఏర్పాటు చేసిన 150 చదరపు మీటర్ల జాతిపిత మహాత్మ గాంధీ మృణ్మయ కుడ్యచిత్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జనవరి 31న ఆవిష్కరించారు.
దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 150 మంది గ్రామీణ కుమ్మరులు తయారుచేసిన 3,870 మట్టిపాత్రలతో ఈ కుడ్యచిత్రాన్ని ఏర్పాటుచేశారు. ‘నా జీవితమే నా సందేశం’ అంటూ గాంధీ చెప్పిన మాటను అందులో లిఖించారు. కుడ్యచిత్ర ఆవిష్కరణ సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ.... మహాత్మా గాంధీ సిద్ధాంతాలు పాటించడమే ఆయనకు మనమిచ్చే నిజమైన నివాళి అని అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహాత్మ గాంధీ మృణ్మయ కుడ్యచిత్రం ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం(ఎన్‌డీఎంసీ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహాత్మ గాంధీ మృణ్మయ కుడ్యచిత్రం ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఢిల్లీ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం(ఎన్‌డీఎంసీ)
Published date : 01 Feb 2019 05:08PM