Skip to main content

గాంధేయవాది సదాశివ భోసలే అస్తమయం

దేశంలో తొలి సార్వత్రిక ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది సదాశివ రావు బాపు సాహెబ్‌ భోసలే (101) కన్నుమూశారు.
Current Affairs
వృద్ధాప్యంతో బెళగావి జిల్లా కడోళి గ్రామంలో తన స్వగృహంలో ఏప్రిల్‌ 15న తుదిశ్వాస విడిచారు. భోసలే బెళగావి దక్షిణ, హిరేబాగేవాడి స్థానాల నుంచి కర్ణాటక శాసనసభకు రెండు సార్లు ఎన్నికయ్యారు. భూదానోద్యమంలో పాల్గొనడమే కాకుండా తనకున్న 25 ఎకరాల భూమిని పేదలకు పంచి పెట్టారు. ఉత్తర కర్ణాటకకి అన్యాయం జరుగుతోందనే బాధతో 12 ఏళ్లపాటు అనేక పోరాటాల్లో పాల్గొన్నారు. 1969లో ఎమర్జెన్సీ సమయంలో జైలుశిక్షను అనుభవించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది కన్నుమూత
ఎప్పుడు : ఏప్రిల్‌ 15
ఎవరు : సదాశివ రావు బాపు సాహెబ్‌ భోసలే (101)
ఎక్కడ : కడోళి గ్రామం, బెళగావి జిల్లా
ఎందుకు : వృద్ధాప్య సమస్యల కారణంగా...
Published date : 17 Apr 2021 04:37PM

Photo Stories