గాలె గ్లాడియేటర్స్ కెప్టెన్‌గా నియమితులైన పాక్ మాజీ క్రికెటర్?
Sakshi Education
లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పీఎల్)లో ‘గాలె గ్లాడియేటర్స్’ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ఎంపికయ్యాడు.
2020, నవంబర్ 26 నుంచి డిసెంబర్ 16 వరకు టి20 ఫార్మాట్‌లో జరుగనున్న ఈ టోర్నీలో... సర్ఫరాజ్ అహ్మద్ స్థానాన్ని అఫ్రిది భర్తీ చేయనున్నాడు. ఈ విషయాన్ని ఫ్రాంచైజీ యజమాని, పాకిస్తాన్ పారిశ్రామికవేత్త నదీమ్ ఒమర్ నవంబర్ 22న తెలిపారు. తొలిసారిగా జరుగనున్న ఎల్‌పీఎల్ టోర్నీలో జాఫ్నా స్టాలియన్స్, క్యాండీ టస్కర్స్, గాలె గ్లాడియేటర్స్, కొలంబో కింగ్‌స, దంబుల్లా హాక్స్ జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎల్‌పీఎల్ ఫ్రాంచైజీ గాలె గ్లాడియేటర్స్ కెప్టెన్‌గా ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎల్‌పీఎల్ ఫ్రాంచైజీ గాలె గ్లాడియేటర్స్ కెప్టెన్‌గా ఎంపిక
ఎప్పుడు : నవంబర్ 22
ఎవరు : పాకిస్తాన్ మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది
Published date : 23 Nov 2020 06:00PM