గాడ్‌ఫాదర్ ఆఫ్ సుడోకుఅని ఎవరిని పిలుస్తారు?
Sakshi Education
అంకెలతో ఆసక్తి పుట్టించే సుడోకు రూపకర్త, గాడ్‌ఫాదర్ ఆఫ్ సుడోకుగా పేరుపొందిన జపాన్‌కు చెందిన మాకికాజీ(69) కన్నుమూశారు.
బైల్ డక్ట్ కేన్సర్‌తో బాధపడుతూఆగస్టు 10న కాజీమరణించారని... ఆయన స్థాపించిన నికోలి కో. సంస్థకు చెందిన ఉద్యోగులు వెల్లడించారు.2004 నుంచిబాగా ప్రాచుర్యంలోకి వచ్చిన సుడోకును.. జపనీయులు స్థానికంగా సుజి–వా–డోకుషిన్–ని–కగిరుఅని పిలుస్తారు.దాన్ని షార్ట్‌కట్‌లోసుడోకుగా వాడుకలోకి వచ్చింది. మాకికాజీ దాదాపు 30 దేశాల్లో సుడోకు పజిల్స్ గురించి చెబుతూ పర్యటించారు. సుడోకుచాంపియన్‌షిప్‌ల ద్వారా దాదాపు 100 దేశాల్లో 20 కోట్ల మందికి చేరువయ్యామని నికోలి కంపెనీ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి :సుడోకు రూపకర్త, గాడ్‌ఫాదర్ ఆఫ్ సుడోకుగా పేరుపొందినవ్యక్తి కన్నుమూత
ఎప్పుడు : ఆగస్టు10
ఎవరు :మాకికాజీ(69)
ఎందుకు :బైల్ డక్ట్ కేన్సర్ కారణంగా...
Published date : 18 Aug 2021 06:35PM