Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 28, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 28th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
February 28th 2023 Current Affairs

T20 Cricket: టి20 చరిత్రలో అత్యంత చెత్త రికార్డు.. 10 పరుగులకే ఆలౌట్.. 

టి20లంటే ఎప్పుడు మెరుపులేనా? అప్పుడప్పుడు మలుపులుంటాయి. బౌలింగ్‌ దెబ్బలూ ఉంటాయి. బ్యాటర్లు, బ్యాటింగ్‌ జట్లే కాదు. పొట్టి క్రికెట్లో అరివీర భయంకర బౌలింగ్, బౌలర్లు కూడా ఠారెత్తిస్తారు. స్పెయిన్‌ జట్టు కూడా అదే పని చేసింది.  ఫిబ్రవరి 26 స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ అనే చిన్న ద్వీపదేశాన్ని క్రికెట్‌ చరిత్రలో నిలిచేంతగా దెబ్బ కొట్టింది. స్పానిష్‌ బౌలర్ల ధాటికి 11 మంది బరిలోకి దిగిన ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ క్రికెట్‌ జట్టు అంతా కలిసి 10 పరుగులకే ఆలౌటైంది. ఇదో రికార్డు అయితే 11 పరుగుల లక్ష్యాన్ని స్పెయిన్‌ జట్టు రెండు సిక్సర్లతో పూర్తి చేయడం మరో విశేషం. మొదట బ్యాటింగ్‌ చేసిన ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ జట్టు 8.4 ఓవర్లలో 10 పరుగులకు కుప్పకూలింది. ఇందులో ఆరుగురు డకౌట్ అయ్యారు. అతీఫ్‌ 4 వికెట్లలో ‘హ్యాట్రిక్‌’ కూడా ఉంది. 

T20 World Cup: ఆరోసారి టి20 ప్రపంచకప్‌ కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా
11 పరుగుల విజయ లక్ష్యాన్ని స్పెయిన్‌ బ్యాటర్‌ అవైస్‌ అహ్మద్‌ (12 నాటౌట్‌; 2 సిక్సర్లు) ఒక్కడే ముగించేశాడు. ‘ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌’ బౌలర్‌ జోసెఫ్‌ తొలి బంతి నోబాల్‌ వేయగా, 2, 3 బంతుల్ని అవైస్‌ భారీ సిక్సర్లుగా బాదాడు. 6 మ్యాచ్‌ల సిరీస్‌ను స్పెయిన్‌ 5–0తో కైవసం చేసుకుంది. వానతో రెండో టి20 రద్దయ్యింది. ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ చెత్త రికార్డుతో రెండు రికార్డులు కనుమరుగయ్యాయి. అంతర్జాతీయ క్రికెట్లో చెక్‌ రిపబ్లిక్‌తో 2019లో జరిగిన పోరులో టర్కీ అత్యల్ప స్కోరు (21 ఆలౌట్‌) తెరమరుగైంది. ఇక ఓవరాల్‌ టి20 ఫార్మాట్‌లో అడిలైడ్‌ స్ట్రయికర్స్‌ ధాటికి సిడ్నీ థండర్స్‌ గత ఆగస్టులో 15 పరుగులకు ఆలౌటైన రికార్డు కూడా చెదిరిపోయింది. అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)లో ఐల్‌ ఆఫ్‌ మ్యాన్‌ జట్టు 2017లో అసోసియేట్‌ సభ్య దేశంగా మారింది. 2018లో టి20 ప్రపంచకప్‌ యూరోప్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో పోటీపడి ఆరో స్థానంలో నిలిచింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Economy) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

ATP Rankings: జొకోవిచ్‌ ‘నంబర్‌వన్‌’ రికార్డు
టెన్నిస్‌ చరిత్రలో ఏ ప్లేయర్‌కూ సాధ్యంకాని ఘనతను సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌ సొంతం చేసుకున్నాడు. 1973 నుంచి టెన్నిస్‌లో కంప్యూటర్‌ ర్యాంకింగ్స్‌ మొదలయ్యాక అత్యధిక వారాలు ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా జొకోవిచ్‌  రికార్డు నెలకొల్పాడు. ఫిబ్ర‌వ‌రి 27న‌ విడుదల చేసిన అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ఏటీపీ) తాజా ర్యాంకింగ్స్‌లో జొకోవిచ్‌ 6,980 పాయింట్లతో తన టాప్‌ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. దాంతో ఈ సెర్బియా స్టార్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ హోదాలో 378 వారాలు పూర్తి చేసుకోవడం ఖాయమైంది. ఇప్పటి వరకు ఈ రికార్డు జర్మనీ దిగ్గజం, మహిళా స్టార్‌ స్టెఫీ గ్రాఫ్‌ పేరిట ఉంది. గ్రాఫ్‌ 377 వారాలు నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
పురుషుల సింగిల్స్‌లో అత్యధిక వారాలు టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన ప్లేయర్‌గా 2021 మార్చిలోనే జొకోవిచ్‌ గుర్తింపు పొందాడు. స్విట్జర్లాండ్‌ మేటి రోజర్‌ ఫెడరర్‌ (310 వారాలు) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ బద్దలు కొట్టాడు. తాజాగా అటు పురుషుల విభాగంలోగానీ, ఇటు మహిళల విభాగంలోగానీ అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా నిలిచిన ప్లేయర్‌గా ఈ సెర్బియా యోధుడు చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. కెరీర్‌లో 22 గ్రాండ్‌స్లామ్‌ సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన జొకోవిచ్‌ 2011 జూలై 4న 24 ఏళ్ల 43 రోజుల ప్రాయంలో తొలిసారి ప్రపంచ నంబర్‌వన్‌ అయ్యాడు. ఏటీపీ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ర్యాంక్‌లో నిలిచిన 28 ప్లేయర్లలో ఒకడైన  జొకోవిచ్‌ రికార్డుస్థాయిలో ఏడుసార్లు సీజన్‌ను నంబర్‌వన్‌ ర్యాంక్‌తో ముగించాడు.  
అత్యధిక వారాలు అగ్రస్థానంలో నిలిచిన టాప్‌–5 ప్లేయర్లు 
1. జొకోవిచ్‌         378 వారాలు 
2. స్టెఫీ గ్రాఫ్‌         377 వారాలు 
3. మార్టినా నవ్రతిలోవా     332 వారాలు 
4. సెరెనా విలియమ్స్‌     319 వారాలు 
5. రోజర్‌ ఫెడరర్‌     310 వారాలు 

Qatar Open: ఖతర్‌ ఓపెన్‌ ఏటీపీ–250 టోర్నీ విజేత‌గా బోపన్న–ఎబ్డెన్‌ జోడీ

WPL 2023: గుజరాత్‌ జెయింట్స్ కెప్టెన్‌గా బెత్‌ మూనీ 
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) టి20 క్రికెట్ టోర్టీలో పాల్గొనే గుజరాత్‌ జెయింట్స్‌ జట్టుకు ఆస్ట్రేలియా ఓపెనర్‌ బెత్‌ మూనీ కెప్టెన్‌గా.. భారత ఆల్‌రౌండర్‌ స్నేహ్‌ రాణా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో తొలి  డబ్ల్యూపీఎల్‌ జరగనుంది. 29 ఏళ్ల మూనీ ఇప్పటి వరకు 83 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 18 అర్ధ సెంచరీల సహాయంతో 2,380 పరుగులు చేసింది.   


Lionel Messi: లియోనెల్ మెస్సీకి బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డు 
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనెల్ మెస్సీకి బెస్ట్ మెన్స్ ప్లేయర్‌ కిరీటం వరించింది. పారిస్ వేదికగా ఫెడరేషన్‌ ఇంటర్నేషనల్‌ ది ఫుట్‌బాల్‌ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్‌ ఫిఫా ఫుట్‌బాల్‌ అవార్డ్స్‌లో మెస్సీ ఈ అవార్డును అందుకున్నారు. 2022 డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌ కప్‌లో మెస్సీ అద్భుత ఆటతీరుతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నలిపాడు. ఈ సందర్భంగా  మెస్సీ మాట్లాడుతూ ఫిఫా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంద‌న్నారు.  

ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న మెస్సీ తాజాగా ఫిఫా మెన్స్‌ బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మెస్సీతో పాటు ఫ్రాన్స్‌ ఫుట్‌బాల్‌ స్టార్స్‌ కైలియన్‌ ఎంబాపె, కరీమ్‌ బెంజెమాలు పోటీ పడ్డారు. అయితే మెస్సీని దాటి అవార్డు అందుకోవడంలో ఈ ఇద్దరు విఫలమయ్యారు.  2021 ఆగస్టు 8 నుంచి 18 డిసెంబర్‌ 2022 వరకు మెన్స్‌ ఫుట్‌బాల్‌లో ఔట్‌స్టాండింగ్‌ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్ల జాబితాను ఎంపిక చేశారు.

FIFA World Cup 2022 History : ఫిఫా వరల్డ్‌కప్ వెనుక ఉన్న కథ ఇదే.. ఇప్ప‌టి వ‌ర‌కు విజేతలుగా నిలిచిన జ‌ట్లు ఇవే..

ఈ జాబితాలో మెస్సీ 52 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌ కైవసం చేసుకోగా.. కైలియన్‌ ఎంబాపె 44 పాయింట్లతో రెండో స్థానం, కరీమ్‌ బెంజెమా 34 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. కాగా మెస్సీ ఫిఫా మెన్స్‌ బెస్ట్‌ ప్లేయర్‌ అవార్డు గెలుచుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇంతకముందు వరుసగా 2009, 2010, 2011, 2012, 2015, 2019.. తాజాగా 2023లో మరోసారి అవార్డును గెలుచుకున్నాడు.

ఉత్తమ FIFA ఉమెన్స్ ప్లేయర్ విజేత: అలెక్సియా పుటెల్లాస్
ఉత్తమ FIFA పురుషుల కోచ్ విజేత: లియోనెల్ స్కలోని
ఉత్తమ FIFA మహిళా కోచ్ విజేత: సరీనా విగ్మాన్
ఉత్తమ FIFA పురుషుల గోల్ కీపర్ విజేత: ఎమిలియానో మార్టినెజ్
ఉత్తమ FIFA మహిళా గోల్ కీపర్ విజేత: మేరీ ఇయర్ప్స్

FIFA World Cup History : ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని దేనితో.. ఎలా తయారు చేస్తారంటే..?


Khushbu Sundar: ఎన్‌సీడబ్ల్యూ సభ్యురాలిగా ఖుష్బూ
ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ సుందర్‌(52) జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) సభ్యురాలిగా నియమితులయ్యారు. బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యురాలైన ఆమె ఫిబ్ర‌వ‌రి 27వ తేదీ ట్వీట్‌ చేశారు. ఆమెతో పాటు మేఘాలయకు చెందిన డెలినా ఖొంగ్‌డుప్, జార్ఖండ్‌వాసి మమతా కుమారి కూడా ఎన్‌సీడబ్ల్యూకు నామినేట్‌ అయ్యారు. సినీ నటి, నిర్మాత అయిన ఖుష్బూ తొలుత డీఎంకేలో, తర్వాత కాంగ్రెస్‌లో కొనసాగారు. బీజేపీలో చేరి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Bear Carcass: చెక్కుచెదరని స్థితిలో దొరికిన 3,500 ఏళ్ల నాటి ఎలుగు కళేబరం!
దాదాపుగా 3,500 ఏళ్ల నాటి ఎలుగుబంటి కళేబరం ఏమాత్రం చెక్కుచెదరని స్థితిలో దొరికి సైంటిస్టులను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అది పూర్తిగా అతిశీతల వాతావరణంలో మంచులో కూరుకుపోవడమే ఇందుకు కారణం. రష్యాలో మాస్కోకు 4,600 కిలోమీటర్ల దూరంలో న్యూ సైబీరియన్‌ ఆర్చిపెలాగోలో భాగమైన బొల్షోయ్‌ ల్యాక్షోవ్‌స్కీ ద్వీపంలో జింకల వేటగాళ్లు దీన్ని 2020లో గుర్తించారు. ‘‘అది ఆడ ఎలుగుబంటి. గోధుమ రంగుతో, 1.55 మీటర్ల ఎత్తు, దాదాపు 78 కిలోల బరువుంది. చనిపోయేనాటికి బహుశా మూడేళ్ల వయసుంటుంది’’ అని తూర్పు సైబీరియాలోని లజరేవ్‌ మామూత్‌ మ్యూజియం లేబొరేటరీ చీఫ్‌ మాక్సిం చెప్రసోవ్‌ అంచనా వేశారు.
ఆయన సారథ్యంలోని సైంటిస్టుల బృందం దానికి శవపరీక్ష జరిపింది. ‘‘దాని ఒంట్లోని అతి మృదువైన కణజాలం కూడా గులాబి రంగులో ఇప్పటికీ ఏమాత్రం పాడవకుండా ఉండటం నిజంగా అద్భుతం. అలాగే పసుపు రంగులోని కొవ్వు కూడా. అంతేగాక దాని చివరి తిండి తాలూకు పక్షి ఈకలు, మొక్కలు కూడా పొట్టలో అలాగే ఉన్నాయి. అంత పురాతన కాలపు జంతువు తాలూకు కళేబరం ఇంత చక్కని స్థితిలో పరిపూర్ణంగా దొరకడం ఇదే తొలిసారి’’ అని పేర్కొంది. దాని మెదడు, అంతర్గత అవయవాలను కోసి లోతుగా పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కణజాల, సూక్ష్మజీవ, జన్యుపరమైన పరీక్షల్లో తలమునకలుగా ఉన్నారట.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)

Venus-Jupiter Conjunction: అతి సమీపానికి గురు, శుక్ర గ్రహాలు 
గురు, శుక్ర గ్రహాలు పరస్పరం అత్యంత సమీపానికి రానున్నాయి. ఈ అరుదైన ఘటన మార్చి 1వ తేదీన కనువిందు చేయనుంది. ఆ రాత్రి భూమి నుంచి చూస్తే అవి రెండూ దాదాపు ఒకదాన్నొకటి ఆనుకున్నంత దగ్గరగా కనిపిస్తాయి! నిజానికవి ఎప్పట్లాగే పరస్పరం కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. కాకపోతే సూర్యుని చుట్టూ వాటి పరిభ్రమణ క్రమంలో భాగంగా భూమి నుంచి చూసేవాళ్లకు మాత్రం ఆ రోజు పరస్పరం అత్యంత దగ్గరగా వచ్చినట్టు కనిపిస్తాయన్నమాట. దీన్ని మామూలు కళ్లతోనే చూడొచ్చు. సౌరమండలంలో సూర్యచంద్రుల తర్వాత అత్యంత ప్రకాశవంతమైనది శుక్రుడే. భూమికి అత్యంత సమీపంలో ఉండటంతో అప్పుడప్పుడూ పగటి పూటా కనిపిస్తుంటుంది!

Global Warming: గ్లోబల్ వార్మింగ్‌కు.. చంద్రధూళితో చెక్‌!

Female Population: ఏపీలో పెరుగుతున్న ఆడపిల్లల సంఖ్య.. ప్ర‌తి వెయ్యి మంది అబ్బాయిలకు ఎంత మంది అమ్మాయిలున్నారంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో అబ్బాయిలను మించి ఆడపిల్లల సంఖ్య పెరిగిపోతోంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అబ్బాయిలు కన్నా అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. 2021–22 లేబర్‌ ఫోర్స్‌ సర్వేను కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. దాని ప్రకారం.. దేశంలో అత్యధికంగా అమ్మాయిలున్న రాష్ట్రాల్లో కేరళ మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి మొదటి స్థానంలో ఉంది. జూలై 2021 నుంచి జూన్‌ 2022 మధ్య సర్వే నిర్వహించినట్టు నివేదిక పేర్కొంది. దేశం మొత్తం మీద చూస్తే.. 8 రాష్ట్రాల్లోనే అబ్బాయిల కన్నా అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది. 

JSW Steel Plant: కడప స్టీల్‌ప్లాంట్‌కు సీఎం జగన్‌ భూమి పూజ

మిగతా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమ్మాయిలు కన్నా అబ్బాయిల సంఖ్యే ఎక్కువ. జాతీయ స్థాయిలో కూడా అబ్బాయిల సంఖ్యే ఎక్కువగా ఉంది. 2019–20లో జాతీయ స్థాయిలో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 963 మంది అమ్మాయిలుండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య 968కు పెరిగింది. అలాగే రాష్ట్రంలో 2019–20లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలుండగా, 2021–22 నాటికి ఆ సంఖ్య 1,046కు పెరిగింది. పూర్తి స‌మాచారానికి ఇక్క‌డ క్లిక్ చేయండి

Published date : 28 Feb 2023 06:01PM

Photo Stories