Daily Current Affairs in Telugu: ఫిబ్రవరి 20 2023 కరెంట్ అఫైర్స్
Joint Air Exercise: దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు
ఉత్తరకొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం జరిపిన నేపథ్యంలో ఫిబ్రవరి 19న దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. ఫిబ్రవరి 19న జరిపిన ఈ విన్యాసాల్లో అమెరికా వ్యూహాత్మక బాంబర్లు పాల్గొన్నాయి. అమెరికా బి–1బి బాంబర్లకు దక్షిణ కొరియా ఎఫ్–35ఏ, ఎఫ్–15ఏ, అమెరికా ఎఫ్–16 రక్షణగా నిలిచాయి. రెండు మిత్ర దేశాలు ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు తమకున్న రక్షణ సంసిద్ధతను ప్రదర్శించాయని దక్షిణ కొరియా ఒక ప్రకటనలో తెలిపింది.
పాన్‌తో కలిసి అమెరికా సంయుక్త వైమానిక విన్యాసాలు జరుపనుందని జపాన్ వార్తా సంస్థ తెలిపింది. ఉత్తరకొరియా ఫిబ్రవరి 18న రాజధాని ప్యాంగ్‌యాంగ్ నుంచి లాంగ్–రేంజ్ క్షిపణిని జపాన్ సముద్రం తీరంలోకి ప్రయోగించింది. ఈ క్షిపణి గంటలో 900 కిలోమీటర్లు (560 మైళ్లు) ప్రయాణించింది. జపాన్‌కు చెందిన ఓషిమా దీవికి 200 కిలోమీటర్ల దూరంలోని సముద్ర జలాల్లో క్షిపణి కూలిపోయినట్లు సమాచారం.
Cheetahs: యుద్ధ విమానాల్లో భారత్‌కు వచ్చిన 12 చీతాలు
Shiv Sena: రూ.2,000 కోట్లతో పార్టీ పేరు, ఎన్నికల గుర్తు కొనుగోలు!
శివసేన పార్టీ పేరు, ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ కొనుగోలు వెనుక ఇప్పటిదాకా రూ.2,000 కోట్ల డీల్ చోటుచేసుకుందని ఉద్ధవ్ ఠాక్రే వర్గంలోని కీలక నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ ఆరోపించారు. ‘‘ఇది 100 శాతం నిజం. మహారాష్ట్ర ప్రభుత్వానికి సన్నిహితుడైన ఓ బిల్డర్ నాకీ విషయం చెప్పాడు’’ అంటూ ఫిబ్రవరి 19న ట్వీట్ చేశారు. డీల్‌కు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, త్వరలో బయటపెడతానని స్పష్టం చేశారు. దేశ చరిత్రలో ఇలాంటి తప్పుడు వ్యవహారాలు గతంలో ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు.
రూ.2,000 కోట్లు అంటే చిన్న మొత్తమేమీ కాదని తెలిపారు. రౌత్ ఆరోపణలను సీఎం ఏక్‌నాథ్ షిండ్ వర్గం నాయకుడు సదా సర్వాంకర్ ఖండించారు. సంజయ్ రౌత్ క్యాషియరా? అని ప్రశ్నించారు. ఆధారాల్లేని ఆరోపణలు చేయొద్దని, స్వతంత్ర సంస్థలైన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం ప్రతిష్టను దెబ్బతీయొచ్చని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ నేత సుధీర్ మునగంటివార్ హితవు పలికారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)
Chandrayaan-3: ‘చంద్రయాన్–3’లో కీలక పరీక్ష విజయవంతం
చంద్రయాన్–3 ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ఎలక్ట్రో–మ్యాగ్నెటిక్ ఇంటర్‌ఫియరెన్స్/ఎలక్ట్రో–మ్యాగ్నెటిక్ కంపాటిబిలిటీ(ఈఎంఐ/ఈఎంసీ) పరీక్ష విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఫిబ్రవరి 19వ తేదీ ప్రకటించింది. బెంగళూరులోని యూఆర్ రావు శాటిలైట్ సెంటర్‌లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 2 వరకూ ఈ పరీక్ష నిర్వహించారు. శాటిలైట్ ఉప వ్యవస్థలు అంతరిక్ష వాతావరణంలో సక్రమంగా పనిచేసేలా చూడడానికి ఈఎంఐ/ఈఎంసీ టెస్టు నిర్వహించారు. శాటిలైట్ ప్రయోగాల్లో ఇది ముఖ్యమైన పరీక్ష అని ఇస్రో పేర్కొంది. చంద్రుడిపైన లూనార్‌ను క్షేమంగా దించడమే లక్ష్యంగా చంద్రయాన్–3 ప్రయోగాన్ని ఈ ఏడాది జూన్‌లో చేపట్టే అవకాశం ఉంది. కాగా 2019లో చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైన విషయం మనకు తెలిసిందే.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (22-28 జనవరి 2023)
Serum Institute: అంటువ్యాధుల సన్నద్ధతపై హైదరాబాద్‌లో ప్రత్యేక కేంద్రం
ప్రముఖ టీకాల తయారీ సంస్థ సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్‌లో అంటువ్యాధులు, మహమ్మారుల సన్నద్ధతపై సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)ను ఏర్పాటు చేయనుంది. నగరంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (ఐఐపీఎం) ఆవరణలో ఈ కేంద్రాన్ని డాక్టర్ సైరస్ పూనావాలా పేరిట నెలకొల్పనుంది. ఈ మేరకు సీరమ్ సంస్థ ఫిబ్రవరి 19వ తేదీ ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్‌లో వర్చువల్‌గా జరిగిన ఒక కార్యక్రమంలో సీరం ఇన్‌స్టిట్యూట్ ఈ మేరకు ప్రకటించింది. ప్రజారోగ్య అత్యవసర సమయాల్లో సమాచారం, వనరులు, సాయం అందించేందుకు దీన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.
ప్రజారోగ్యంపై చైతన్యం, అంటువ్యాధుల వ్యాప్తిపై స్పందించేలా దీన్ని తీర్చిదిద్దనుంది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ దేశవ్యాప్తంగా స్థాపించిన ఐదు సంస్థలలో ఇదొకటి. గతేడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సమావేశాల సందర్భంగా సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదర్ పూనావాలాతో రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కేటీఆర్ సీవోఈ ఏర్పాటుపై చర్చించారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (01-07 జనవరి 2023)
Electricity: తలసరి ‘విద్యుత్’లో తెలంగాణ 5వ స్థానం..
వార్షిక తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఐదో స్థానంలో నిలిచింది. 3,137 యూనిట్లతో గోవా అగ్రస్థానంలో ఉండగా, 2,200 యూనిట్లతో పంజాబ్, 2,131 యూనిట్లతో హరియాణా, 2,048 యూనిట్లతో గుజరాత్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లుగా ఉంది. 2019–20లో భారతదేశ తలసరి విద్యుత్ వినియోగం 1,208 యూనిట్లుకాగా.. 2020–21లో 1,161 యూనిట్లకు తగ్గిపోయింది. 2020–21 సంవత్సరానికి సంబంధించిన లెక్కలతో.. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) తాజాగా విడుదల చేసిన ‘అఖిల భారత విద్యుత్ గణాంకాలు–2022’నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది.
రాష్ట్రాలతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలను సైతం పరిగణనలోకి తీసుకుంటే.. 10,478 యూనిట్ల తలసరి విద్యుత్ వినియోగంతో దాద్రానగర్ హవేలీ తొలి స్థానంలో, 5,473 యూనిట్లతో డామన్ డయ్యూ రెండో స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో తెలంగాణ 9వ స్థానంలో నిలిచింది. పూర్తి సమాచారానికి ఇక్కడ క్లిక్ చేయండి
Telangana: తెలంగాణ రాష్ట్ర అప్పు రూ.2,83,452 కోట్లు.. కేంద్ర ప్రభుత్వం వెల్లడి
TFPC: టీఎఫ్‌పీసీ అధ్యక్షునిగా దామోదర్ ప్రసాద్
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్(టీఎఫ్‌పీసీ)నూతన అధ్యక్షునిగా కేఎల్ దామోదర్ ప్రసాద్ ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 19న హైదరాబాద్‌లో జరిగిన టీఎఫ్‌పీసీ ఎన్నికల్లో ప్రత్యర్థి పి.కిరణ్‌పై 24 ఓట్ల తేడాతో గెలుపొందారు దామోదర్ ప్రసాద్. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్యానెల్ నుంచి పోటీ చేసిన దామోదర్‌కి 339 ఓట్లు రాగా, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్యానెల్ నుంచి బరిలో దిగిన కిరణ్‌కి 315 ఓట్లు వచ్చాయి. ‘టీఎఫ్‌పీసీ’ ఉపాధ్యక్షులుగా ప్రొగ్రెసిప్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్‌కు చెందిన కె.అశోక్ కుమార్, వై.సుప్రియ, ట్రెజరర్‌గా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్యానెల్ నుంచి తుమ్మలపల్లి రామ సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే టీఎఫ్‌పీసీ సెక్రటరీలుగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్యానెల్‌కు చెందిన టి.ప్రసన్న కుమార్(397 ఓట్లు), వైవీఎస్ చౌదరి (380 ఓట్లు) విజయం సాధించారు. జాయింట్ సెక్రటరీలుగా ప్రొగ్రెసిప్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్‌కు చెందిన భరత్ చౌదరి (412 ఓట్లు), స్వతంత్ర అభ్యర్థి నట్టి కుమార్ (247ఓట్లు) గెలుపొందారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (22-28 జనవరి 2023)
Ranji Trophy: సౌరాష్ట్ర జట్టుదే రంజీ ట్రోఫీ టైటిల్
ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన సౌరాష్ట్ర జట్టు రెండోసారి రంజీ ట్రోఫీ చాంపియన్‌గా నిలిచింది. బెంగాల్‌తో ఫిబ్రవరి 19న ముగిసిన ఫైనల్లో జైదేవ్ ఉనాద్కట్ నాయకత్వంలోని సౌరాష్ట్ర తొమ్మిది వికెట్ల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 169/4తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన బెంగాల్ 241 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ జైదేవ్ ఉనాద్కట్ ఆరు వికెట్లు తీయగా.. మరో పేసర్ చేతన్ సకారియా మూడు వికెట్లు పడగొట్టాడు. బెంగాల్ నిర్దేశించిన 12 పరుగుల లక్ష్యాన్ని సౌరాష్ట్ర ఒక వికెట్ నష్టపోయి ఛేదించింది. మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు తీసిన ఉనాద్కట్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్’ అవార్డురాగా.. టోర్నీ మొత్తంలో 907 పరుగులు సాధించిన అర్పిత్ (సౌరాష్ట్ర) ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దక్కించుకున్నాడు. 2020లో బెంగాల్ జట్టునే ఓడించి సౌరాష్ట్ర తొలిసారి రంజీ చాంపియన్‌గా నిలిచింది. 1990లో చివరిసారి రంజీ ట్రోఫీ టైటిల్ నెగ్గిన బెంగాల్ ఆ తర్వాత ఐదుసార్లు ఫైనల్ చేరగా... ఐదుసార్లూ ఓడిపోయి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (22-28 జనవరి 2023)
Shooting World Cup: భారత షూటర్ వరుణ్‌కు కాంస్యం
ప్రపంచకప్ షూటింగ్ టోర్నీలో భారత్ కాంస్య పతకంతో బోణీ చేసింది. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో 19 ఏళ్ల వరుణ్ తోమర్ మూడో స్థానంలో నిలిచాడు. ఫిబ్రవరి 19వ తేదీ జరిగిన ర్యాంకింగ్ రౌండ్‌లో నిర్ణీత ఐదు సిరీస్‌ల తర్వాత వరుణ్, సరబ్‌జ్యోత్ సింగ్ 250.6 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ‘షూట్ ఆఫ్ షాట్’లో వరుణ్ 10.3 పాయింట్లు స్కోరు చేసి కాంస్యం దక్కించుకోగా.. సరబ్‌జ్యోత్ 10.1 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (22-28 జనవరి 2023)
ATP 500: ఏబీఎన్ ఆమ్రో ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో రన్నరప్‌గా బోపన్న జోడీ
కెరీర్‌లో 23వ డబుల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నకు నిరాశ ఎదురైంంది. ఏబీఎన్ ఆమ్రో ఓపెన్ ఏటీపీ–500 టోర్నీలో బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆస్ట్రేలియా) జోడీ రన్నరప్‌గా నిలిచింది. నెదర్లాండ్స్‌లో ఫిబ్రవరి 19న జరిగిన ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–7 (5/7), 6–2, 10–12తో ఇవాన్ డోడిగ్ (క్రొయేషియా)–ఆస్టిన్ క్రాయిసెక్ (అమెరికా) జోడీ చేతిలో ఓడింది. బోపన్న–ఎబ్డెన్‌లకు 67,960 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 56 లక్షల 24 వేలు) లభించింది.
Hockey World Cup: హాకీ ప్రపంచ విజేత జర్మనీ.. ఫైనల్లో బెల్జియంపై గెలుపు