Skip to main content

Daily Current Affairs in Telugu: ఫిబ్ర‌వ‌రి 17, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu February 17th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
February 17th  Current Affairs

US Presidential Election: అమెరికా అధ్యక్ష ఎన్నిక‌ల్లో.. ట్రంప్‌కి పోటీగా ఆయ‌న‌ వీరవిధేయులే! 
ఒకప్పుడు అందరూ ట్రంప్‌కి వీరవిధేయులు ఇప్పుడు అధ్యక్ష అభ్యర్థిగా ఆయనకే సవాల్‌ విసురుతున్నారు. ట్రంప్‌ ఓటమిపాలైనప్పుడు ఆయన వెన్నంటి నడిచిన వారు, కేపిటల్‌ హిల్‌పై దాడి జరిపినప్పుడు ఆయనకు మద్దతుగా ఉన్నవారు ఇప్పుడు ఆయనకు ఎదురు తిరుగుతున్నారు. రిపబ్లిక్ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం పోటీలో ట్రంప్‌ సన్నిహితులే సై అంటున్నారు. 
  
అమెరికాలో అధ్యక్ష బరిలో దిగడం కోసం పబ్లికన్ పార్టీలో పోటీ పెరిగిపోతోంది. భారతీయ సంతతికి చెందిన నిక్కీ హేలీ తాను పోటీలో ఉన్నట్టు ప్రకటించగానే ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ట్రంప్‌ అనుచరులందరూ ఓటమి పాలవడంతో పార్టీలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లుతోంది. అధ్యక్ష ఎన్నికల సమయానికి ఆయనకు 78 సంవత్సరాలు మీద పడతాయి. దీంతో ఒకప్పుడు ట్రంప్‌కు మద్దతునిచ్చినవారే ఇప్పుడు ఆయనపై పోటీకి సై అంటున్నారు.అయితే పోటీ ప్రధానంగా డొనాల్డ్‌ ట్రంప్, ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డెసాంటిస్‌ మధ్య ఉంటుందని అంచనాలున్నాయి.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (22-28 జనవరి 2023)
 
రిపబ్లికన్లలో ట్రంప్‌కు మద్దతు ఎంత ?  
ట్రంప్‌ అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి దిగుతున్నానని ప్రకటించిన తర్వాత మిశ్రమ స్పందన కనిపించింది. ప్రస్తుతం అమెరికా ఉన్న పరిస్థితిల్లో ట్రంప్‌ వంటి దుందుడుకు ధోరణి కలిగిన వాడే అధ్యక్ష అభ్యర్థిగా ఉంటే గెలుపు సాధిస్తామని కొందరు భావిస్తూ ఉంటే మరికొందరు ట్రంప్‌ నోటి దురుసును అసహ్యించుకుంటున్నారు. ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికల్లో రెడ్‌ వేవ్‌ వస్తుందని అత్యధికులు ఆశించారు. 
అధ్యక్షుడు జో బైడెన్‌ పట్ల నెలకొన్న తీవ్ర వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవడంలో రిపబ్లికన్లు విఫలమయ్యారు. మరీ ముఖ్యంగా ట్రంప్‌ అనుచరులందరూ ఓటమి పాలవడం, కేపిటల్‌ హిల్‌పై దాడికి సంబంధించిన కోర్టు కేసుల్లో ఇరుక్కోవడం వంటి పరిణామాలతో ట్రంప్‌పై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ట్రంప్‌ విధానాలకు గ్రాండ్‌ ఓల్డ్ పార్టీలో అత్యధికులు మద్దతు చెబుతున్నా వాటిని అమలు చేయడంలో ట్రంప్‌ చూపిస్తున్న దూకుడు స్వభావాన్ని వ్యతిరేకిస్తున్నారు. 40 శాతం మంది ట్రంప్‌కు మద్దతుగా ఉంటే, 60 శాతం మంది వేరొకరు అధ్యక్ష అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. 30 నుంచి 50 శాతం మంది ఫ్లోరిడా గవర్నర్‌ డెసాంటిస్‌కు మద్దతివ్వడం విశేషం. అధ్యక్ష అభ్యర్థి ఎన్నికలు పూర్తయ్యే సమయానికి పరిణామాలు వేగంగా మారిపోయి ట్రంప్‌కి అనుకూల పరిస్థితులు వస్తాయన్న అంచనాలు ఉన్నాయి.  పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

Antonio Guterres: పెరిగే సముద్ర మట్టాలతో ప‌లు దేశాలు జలసమాధి!

Earthquake: జమ్మూకశ్మీర్‌లో భూకంపం
జమ్మూకశ్మీర్‌లో ఫిబ్ర‌వ‌రి 17వ తేదీ(శుక్రవారం) ఉదయం 5.01 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.6గా నమోదైనట్లు ఏఎన్‌ఐ వార్తాసంస్థ తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం భూకంపం తూర్పు కత్రా నుంచి 97 కి.మీ దూరంలో సంభవించన‌ట్లు తెలుస్తోంది. భూ అంతర్భాగంలో 10 కిలోమీటర్ల లోతులో  భూకంపం  నమోదైంది. కాగా నెల రోజుల కింద‌ట కూడా దోడా, కిష్త్వార్‌లలో భూకంపం సంభవించింది. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగలేదు. 
సిక్కిం రాష్ట్రంలోని యుక్సోమ్‌లో ఫిబ్రవరి 13 తెల్లవారుజామున 4.15 గంటలకు భూకంపం సంభవించ‌గా, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.3గా నమోదైంది.

లంకలో కరెంట్‌ చార్జీల మోత
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్‌) నిబంధనలు శ్రీలంక ప్రజల పాలిట పెనుభారంగా మారుతున్నాయి. ఐఎంఎఫ్‌ విధించిన నిబంధనలకు తలొగ్గిన శ్రీలంక ప్రభుత్వం విద్యుత్‌ చార్జీలను 66 శాతం పెంచేస్తూ నిర్ణయం తీసుకుంది. కరెంటు చార్జీలు పెంచడం గత ఆరు నెలల్లో ఇది రెండోసారి.  బిల్లుల పెంపు నేపథ్యంలో విద్యుత్‌ కోతలకు ఫిబ్ర‌వ‌రి 16 నుంచే తెరపడింది. ఇకపై నిరంతరాయంగా కరెంటు సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. శ్రీలంకలో గత ఏడాది కాలంగా కరెంటు కోతలు కొనసాగాయి. నిత్యం ఒక గంట నుంచి 14 గంటలదాకా కరెంటు సరఫరా నిలిపివేశారు. రుణం ఇవ్వాలంటే విద్యుత్‌ చార్జీలు పెంచాలని ఐఎంఎఫ్‌ స్పష్టం చేయడంతో శ్రీలంక ప్రభుత్వం ఒప్పుకోక తప్పలేదు. ఐఎంఎఫ్‌ నుంచి 2.9 బిలియన్‌ డాలర్ల రుణం తీసుకోనుంది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (National) క్విజ్ (22-28 జనవరి 2023)

Political Crisis:‘మహారాష్ట్ర’ సంక్షోభంపై సుప్రీం తీర్పు రిజర్వ్‌ 
మహారాష్ట్రలోని శివసేన పార్టీలో చీలికలు ఏర్పడిన అనంతరం తలెత్తిన రాజకీయ సంక్షోభంపై సుప్రీం కోర్టు తన తీర్పుని రిజర్వ్‌ చేసింది. 2016లో నబమ్‌ రెబియా కేసులో తీర్పుని పునఃపరిశీలించాలంటూ విస్తృత ధర్మాసనానికి అప్పగించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని అయిదుగురు సభ్యులున్న ధర్మాసనం శివసేనలో చీలిక, కొందరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకి సంబంధించిన పిటిషన్‌ను ఫిబ్ర‌వ‌రి 16న విచారించింది. ‘ ఠాక్రే, షిండే చీలికవర్గం తరఫు లాయర్ల వాదనలన్నింటినీ విన్నాం. నబమ్‌ రెబియా తీర్పుని పునఃపరిశీలించాలి. దానిని ఏడుగురు సభ్యులున్న విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగిస్తున్నాం’ అని తెలిపింది.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (అవార్డ్స్) క్విజ్ (22-28 జనవరి 2023)
ఏమిటీ నబమ్‌ రెబియా తీర్పు 
ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్‌కున్న అధికారాలపై అరుణాచల్‌ ప్రదేశ్‌లోని నబమ్‌ రెబియా కేసులో 2016లో సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం శాసనసభ స్పీకర్‌ను తొలగించిన నిర్ణయం సభలో పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతికి ఉండదు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో అప్పట్లో అధికార కాంగ్రెస్‌కు చెందిన సీఎం నబమ్‌ టుకీయేని గద్దె దించడానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం సహకారంతో అసమ్మతి నాయకుడు కలిఖో ఫుల్‌ తిరుగుబాటు చేశారు. దీంతో టుకీ సోదరుడైన అసెంబ్లీ స్పీకర్‌ నబమ్‌ రెబియా 21 మంది అసమ్మతి ఎమ్మెల్యేల్లో 14 మందిని అనర్హులుగా ప్రకటించారు. మరోవైపు అసమ్మతి ఎమ్మెల్యేలు స్పీకర్‌ రెబియాను తొలగిస్తూ తీర్మానం చేశారు. 
దీనిపై కాంగ్రెస్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, స్పీకర్‌ను తొలగించిన నిర్ణయం పెండింగ్‌లో ఉన్న సమయంలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం ఉండదని సుప్రీం తీర్పు చెప్పింది. ఈ తీర్పుని అనుసరించి సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి ఊరట లభిస్తుంది. మహారాష్ట అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, థాక్రే విధేయుడు నరహరి సీతారామ్‌ జిర్వాల్‌ను తొలగిస్తూ షిండే వర్గం ఇచ్చిన నోటీసు సభలో పెండింగ్‌లోనే ఉంది.   

వీక్లీ కరెంట్ అఫైర్స్ (వ్యక్తులు) క్విజ్ (01-07 జనవరి 2023)

 Tata Group: 840 విమానాలు కొంటున్నాం 
ఎయిర్‌బస్, బోయింగ్‌ సంస్థల నుంచి మొత్తం 840 కొనుగోలు చేస్తున్నామని టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని ‘ఎయిరిండియా’ చీఫ్‌ కమర్షియల్, ట్రాన్స్‌ఫార్మేషన్‌ అధికారి నిపుణ్‌ అగర్వాల్ ఫిబ్ర‌వ‌రి 16న‌ తెలిపారు. ఎయిర్‌బస్‌ నుంచి 250, బోయింగ్‌ నుంచి 220 విమానాల కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఎయిరిండియా ఇప్పటికే ప్రకటించింది. ప్రపంచంలోని ప్రతి ముఖ్య నగరాన్ని భారత్‌తో ‘నాన్‌–స్టాప్‌’గా అనుసంధానించాలన్నదే తమ గ్రూప్‌ లక్ష్యమని నిపుణ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. నూతన విమానాల కోసం ఎయిర్‌బస్, బోయింగ్‌ సంస్థలతో ఎయిరిండియా కుదుర్చుకున్న ఒప్పందాలపై భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్, బ్రిటన్‌ ప్రధాని సునాక్, ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మాక్రాన్‌ హర్షం వ్యక్తం చేశారు.   

New Governors: 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

Cheetahs: నమీబియా నుంచి 12 చీతాల రాక 
భారత్‌లో చీతాల సంఖ్యను పెంచే లక్ష్యంతో వాటిని దక్షిణాఫ్రికా ఖండం నుంచి రప్పిస్తున్న మోదీ సర్కార్‌ ఈ దఫాలో 12 చీతాలను వాయుమార్గంలో తీసుకొస్తోంది. నమీబియా దేశం నుంచి 12 చీతాలను ఫిబ్రవరి 18వ తేదీన తీసుకొస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్ తెలిపారు. ‘ నమీబియా నుంచి వాటిని తెచ్చేందుకు సీ–17 విమానం ఫిబ్ర‌వ‌రి 16న బయల్దేరింది. భారత్‌కు తెచ్చాక వాటిని ఉంచేందుకు మధ్యప్రదేశ్‌లోని కూనో జాతీయ పార్కులో 10 క్వారంటైన్‌ ఎన్‌క్లోజర్‌లను సిద్ధంచేశాం’ అని మంత్రి చెప్పారు. ఈసారి ఏడు మగ, ఐదు ఆడ చీతాలను తీసుకొస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ 17న ప్రధాని మోదీ తన పుట్టినరోజున కూనో పార్కులోకి ఐదు ఆడ, మూడు మగ చీతాలను విడిచిపెట్టిన విషయం విదితమే. భారత్‌లో 1948లో అంతరించిపోయిన చీతాలను మళ్లీ పెంచేందుకు భారత సర్కార్‌ నడుంబిగించింది. నమీబియా నుంచి దాదాపు పదేళ్లపాటు ఏటా 12 చీతాలను తీసుకొచ్చి అడవుల్లో వదిలేయాలని భావిస్తున్నారు.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (22-28 జనవరి 2023)

Indian American: యూట్యూబ్ కొత్త సీఈఓగా భారతీయుడు.. ఆయ‌నకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విషయాలు మీకు తెలుసా? 
యూట్యూబ్ సీఈఓగా సుసాన్ వో‌జ్‌సికీ వైదొలగ‌డంతో కొత్త సీఈఓగా భారత సంతతికి చెందిన నీల్ మోహన్ బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలంగా యూట్యూబ్‌లో ఎగ్జిక్యూటివ్‌గా కొనసాగుతున్న నీల్ మోహన్ ఇప్పుడు అదే సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టడం విశేషం. కాగా స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్‌ పూర్తిచేసిన ఆయ‌న‌ 2008లో గూగుల్‌లో చేరారు. 2015లో యూట్యూబ్ చీఫ్ ప్రాడక్ట్ ఆఫీసర్‌గా బాధ్యతలు స్వీకరించి యూట్యూబ్ టీవీ, యూట్యూబ్ మ్యూజిక్, ప్రీమియం, షార్ట్స్‌తో సహా పలు భారీ ‘ప్రాడక్టులను’ లాంచ్ చేశారు.

విద్యాభ్యాసం.. 
మోహన్ 1996లో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. అక్కడ అతను అర్జయ్ మిల్లర్ స్కాలర్. ఆ తర్వాత నీల్ 2005లో స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ(MBA) పట్టా పొందాడు. 1996లో తొలత యాక్సెంచర్‌తో తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత నెట్ గ్రావిటీ అనే స్టార్టప్ కంపెనీలో చేరారు. గూగుల్‌లో చేరిన తర్వాత ర్యాంకుల ద్వారా త్వరగా ఎదిగాడు.  వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి


Indian-American: బైడెన్‌ ఆర్థిక బృందంలో భారత సంతతి వ్యక్తి
అమెరికా ఆర్థిక విధానాల విషయంలో అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే ఆర్థిక బృందంలో భారతీయ మూలాలున్న అమెరికన్‌ భరత్‌ రామమూర్తి కీలక స్థానంలో నియ మితులయ్యారు. భరత్‌ను నేషనల్‌ ఎకనమిక్‌ కౌన్సిల్‌(ఎన్‌ఈసీ) డెప్యూటీ డైరెక్టర్‌గా మళ్లీ నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌజ్ ఫిబ్ర‌వ‌రి 15న‌ ప్రకటించింది. వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలకు సంబంధించి భరత్‌ బైడెన్‌కు సలహాదారుగానూ వ్యవహరిస్తారు. 2020 డిసెంబర్‌లో భరత్‌ ఎన్‌ఈసీలో ఆర్థిక సంస్కరణలు, వినియోగదారుల రక్షణ విభాగానికి డెప్యూటీ డైరెక్టర్‌గా పనిచేశారు. 

Lithium: బ్యాటరీల తయారీలో అత్యంత కీలకమైన తెల్ల బంగారం

Russia Ukraine War: మరోసారి ఉక్రెయిన్‌పై క్షిపణుల వర్షం
ఉక్రెయిన్‌ భూభాగాల దురాక్రమణకు దిగిన రష్యా సేనలు ఫిబ్ర‌వ‌రి 15న‌ రాత్రి క్రూయిజ్, ఇతర క్షిపణులతో విరుచుకుపడ్డాయి. రెండు గంటలపాటు ఏకధాటిగా పలు రకాల క్షిపణులు దూసుకొచ్చాయని, 36 మిస్సైళ్లలో 16 క్షిపణులను కూల్చేశామని ఉక్రెయిన్‌ సైనిక చీఫ్‌ వలేరీ జలూజ్నీ చెప్పారు. రష్యా క్షిపణుల దాడిలో ఒక వృద్ధురాలు ప్రాణాలు కోల్పోయింది. ఏడుగురు గాయపడ్డారు. అయితే, రష్యా వాయుసేన కొత్తగా భారీ బెలూన్లను వదులుతోందని వలేరీ చెప్పారు. బెలూన్లకు ఉన్న కార్నర్‌ రిఫ్లెక్టర్లు రాడార్‌ సిగ్నళ్లను వెనక్కి పంపుతాయి. దీంతో ఆకాశంలో శత్రుదేశ డ్రోన్, క్షిపణి వస్తుందని భావించి ఉక్రెయిన్‌ గగనతల రక్షణ వ్యవస్థ క్షిపణులను ప్రయోగిస్తుంది. దీంతో ఉక్రెయిన్‌ క్షిపణులు వృథా అవుతాయి. ‘ఇది రష్యా వేసిన మరో ఎత్తుగడ’ అని వలేరీ అన్నారు. కాగా, రష్యాతో పోరులో మునిగిపోయిన ఉక్రెయిన్‌కు సాయపడేందుకు నార్వే ముందుకొచ్చింది. ఐదు సంవత్సరాల్లో విడతలవారీగా మొత్తంగా 7.4 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం చేస్తామని నార్వే ప్రకటించింది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) క్విజ్ (22-28 జనవరి 2023)

Tulasidas Balaram: ఫుట్‌బాల్‌ దిగ్గజం కన్నుమూత 
రెండు సార్లు ఒలింపిక్స్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన, ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన జట్టులో సభ్యుడైన అలనాటి ఫుట్‌బాల్‌ దిగ్గజం తులసీదాస్‌ బలరాం ఫిబ్ర‌వ‌రి 16వ తేదీ కన్నుమూశారు. 87 ఏళ్ల బలరాం సుదీర్ఘ కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. తమిళ కుటుంబానికి చెందిన బలరాం 1936లో సికింద్రాబాద్‌లోని అమ్ముగూడలో జన్మించారు. ఇక్కడే ఫుట్‌బాల్‌లో ఓనమాలు నేర్చుకున్న ఆయన సంతోష్‌ ట్రోఫీలో హైదరాబాద్‌ జట్టు తరఫున ఆడారు. 
సెంటర్‌ ఫార్వర్డ్‌గా సత్తా చాటిన బలరాం అంతర్జాతీయ కెరీర్‌ 1955–1963 మధ్య ఏడేళ్ల పాటు గొప్పగా సాగింది. అదే సమయంలోనే 1956 మెల్‌బోర్న్, 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లలో ఆయన భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. ఒలింపిక్స్‌కు ఆడిన సమయంలో బలరాం హైదరాబాద్‌ ఆటగాడిగానే ఉన్నారు. 36 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 10 గోల్స్‌ సాధించిన ఆయన 1962 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్‌ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించారు.
ఒక దశలో ‘హోలీ ట్రినిటీ’ అంటూ కితాబులందుకున్న చుని గోస్వామి, పీకే బెనర్జీ, బలరాం త్రయం భారత ఫుట్‌బాల్‌కు అద్భుత విజయాలు అందించింది. ట్యుబర్‌ క్యులోసిస్‌ కారణంగా 27 ఏళ్ల వయసుకే దురదృష్టవశాత్తూ ఆయన కెరీర్‌ ముగిసింది. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత చాలా ఏళ్ల క్రితమే బలరాం కోల్‌కతాకు వెళ్లిపోయి స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. అక్కడే కోచ్‌గా కూడా తన సేవలందించారు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (22-28 జనవరి 2023) 

Published date : 17 Feb 2023 06:16PM

Photo Stories