Skip to main content

ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ బిల్లుకు సభ ఆమోదం

దేశంలో చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రోత్సాహం, మారుమూల, దూర ప్రాంతాలకు విమాన సర్వీసుల విస్తరణకు తొలి అడుగు పడింది.
ఇందుకు సంబంధించిన ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సవరణ) బిల్లు, 2021కు లోక్‌సభ జూలై 29న ఆమోదముద్ర వేసింది. దేశంలో 128 విమానాశ్రయాలు త్వరలో ఏర్పాటవుతాయని భావిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా ఈ సందర్భంగా తెలిపారు. ఎసెన్షియల్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ బిల్లు–2021, ట్రిబ్యునల్‌ రిఫార్మ్స్‌ బిల్లు–2021లను ఆగస్టు 3న లోక్‌సభ ఆమోదించింది.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఎయిర్‌పోర్ట్స్‌ ఎకనమిక్‌ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సవరణ) బిల్లు, 2021కు ఆమోదం
ఎప్పుడు : జూలై 29
ఎవరు : లోక్‌సభ
ఎందుకు : దేశంలో చిన్న విమానాశ్రయాల ఏర్పాటుకు ప్రోత్సాహం, మారుమూల, దూర ప్రాంతాలకు విమాన సర్వీసుల విస్తరణకు...
Published date : 04 Aug 2021 05:47PM

Photo Stories