Skip to main content

ఎయిరిండియా సీఎండీగా అశ్వని లోహని

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్ (సీఎండీ)గా అశ్వని లోహనిని నియమిస్తూ క్యాబినెట్ నియామకాల కమిటీ ఫిబ్రవరి 13న ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఎయిర్ ఇండియా సీఎండీగా అశ్వని రెండోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. గతంలో ఆగష్టు 2015 నుంచి 2017 ఆగస్టు వరకు ఎయిర్ ఇండియా సీఎండీగా ఆయన వ్యవహరించారు. రైల్వే బోర్డు చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించిన 60 ఏళ్ల లోహని.. 2018, డిసెంబర్‌లో ఈ పదవి నుంచి విరమించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎయిరిండియా సీఎండీ నియామకం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : అశ్వని లోహని
Published date : 14 Feb 2019 05:36PM

Photo Stories