Skip to main content

ఎయిర్ రైఫిల్ ఆన్‌లైన్ చాంపియన్‌షిప్‌లో పసిడి నెగ్గిన భారత షూటర్?

బంగ్లాదేశ్ షూటింగ్ స్పోర్ట్ సమాఖ్య ఆధ్వర్యంలో అక్టోబర్ 18న జరిగిన షేక్ రసెల్అంతర్జాతీయ ఎయిర్ రైఫిల్ ఆన్‌లైన్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్లు మెరిశారు.
Current Affairs
మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్ ఇలవేనిల్ వలరివన్ పసిడి పతకం నెగ్గగా... పురుషుల విభాగంలో షాహు తుషార్ మానే రజతం దక్కించుకున్నాడు. ఇలవేనిల్ 627.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 1000 డాలర్ల (రూ. 73 వేలు) ప్రైజ్‌మనీని సొంతం చేసుకుంది. షియోరి హిరాట (జపాన్) రెండో స్థానంలో... విద్య తోయిబా (ఇండోనేసియా) మూడో స్థానంలో నిలిచారు.

పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో జపాన్ షూటర్ నయోయ ఒకాడ 630.9 పాయింట్లతో బంగారు పతకాన్ని గెల్చుకోగా... తుషార్ 623.8 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని పొందాడు. తుషార్‌కు 700 డాలర్లు (రూ. 51 వేలు) ప్రైజ్‌మనీగా లభించాయి. అబ్దుల్లా (బంగ్లాదేశ్) మూడో స్థానంలో నిలిచాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : షేక్ రసెల్ అంతర్జాతీయ ఎయిర్ రైఫిల్ ఆన్‌లైన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతక విజేత
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : ఇలవేనిల్ వలరివన్
ఎక్కడ : మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం
Published date : 19 Oct 2020 05:40PM

Photo Stories