ఎవరి ఆస్తులను శత్రు ఆస్తులుగా పరిగణిస్తారు?
Sakshi Education
దేశంలో 12,600కు పైగా శత్రు ఆస్తులను కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఫర్ ఇండియా (సీఈపీఐ) స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా ఈ వివరాలను ఆగస్టు 4న రాజ్యసభలో వెల్లడించారు. భారత్ వదలి పాకిస్తాన్, చైనాలకు వెళ్లి అక్కడి పౌరసత్వం తీసుకున్న వారి ఆస్తులను శత్రు ఆస్తులుగా పరిగణిస్తారు. ఇందులో పాకిస్తాన్‌కు వెళ్లిన వారి ఆస్తులు 12,485కాగా, 126 చైనాకు వెళ్లిన వారివి. శత్రు ఆస్తుల్లో అధికంగా ఉత్తరప్రదేశ్‌లోనే (6,255) ఉన్నాయి.
కోకోనట్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్‌జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’, ‘కోకోనట్ డెవలప్‌మెంట్ బోర్డు(అమెండ్‌మెంట్) బిల్లు–2021’లకు ఆగస్టు 4న లోక్‌సభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో ‘ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(అమెండ్‌మెంట్) బిల్లు–2021’కు ఆమోదం లభించింది.

Published date : 05 Aug 2021 06:04PM