Skip to main content

ఎవరెస్ట్ పర్వతంపై ప్లాస్టిక్ నిషేధం

ప్రపంచంలోనే అత్యంత ఎత్తై శిఖరం ఎవరెస్ట్‌పై ఒకసారి వాడిపారేసే ప్లాస్టిక్‌ను నిషేదిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ నిబంధన 2020, జనవరి నుంచి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. హిమాలయాల్లో స్వచ్ఛమైన సరస్సులు, ప్రకృతి అందాలకు మధ్య కొలువైన ఎవరెస్ట్‌ను అధిరోహించడానికి ఏటా వేలాది ఔత్సాహికులు ప్రయత్నిస్తుంటారు. ఈ క్రమంలో వారు తీసుకెళ్లే ప్లాస్టిక్ కవర్లు, నీళ్ల సీసాలు ఇతర వస్తువులతో ఈ ప్రాంతం ప్లాస్టిక్ దిబ్బగా మారుతోంది. దీన్ని నివారించేందుకు నేపాల్ ప్రభుత్వం ప్లాస్టిక్ నిషేధ నిర్ణయాన్ని తీసుకుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎవరెస్ట్ పర్వతంపై ప్లాస్టిక్ నిషేధం
ఎప్పుడు : ఆగస్టు 22
ఎవరు : నేపాల్ ప్రభుత్వం
Published date : 23 Aug 2019 05:42PM

Photo Stories