Skip to main content

ఏటీపీ ఫైనల్స్ టోర్నమెంట్ విజేత సిట్సిపాస్

గ్రీస్ టెన్నిస్ క్రీడాకారుడు స్టెఫనోస్ సిట్సిపాస్ ప్రతిష్టాత్మక సీజన్ ముగింపు టోర్నీ ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్‌లో విజేతగా నిలిచాడు.
లండన్ లో నవంబర్ 18న జరిగిన ఈ టోర్ని ఫైనల్లో ఆరో సీడ్ సిట్సిపాస్ 2 గంటల 35 నిమిషాల్లో 6-7 (6/8), 6-2, 7-6 (7/4) స్కోరుతో ఐదో సీడ్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. 21 ఏళ్ల 3 నెలల వయసులో ఏటీపీ ఫైనల్స్ టైటిల్ సాధించిన సిట్సిపాస్... 2001 (నాడు 20 ఏళ్ల లీటన్ హెవిట్) తర్వాత అతి పిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఫైనల్స్ చేరిన తొలి సీజన్‌లోనే సిట్సిపాస్ విజేతగా నిలవడం మరో చెప్పుకోదగ్గ విశేషం. సిట్సిపాస్‌కు 26 లక్షల 56 వేల డాలర్లు (రూ.19 కోట్ల 8 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1300 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏటీపీ వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్ని విజేత
ఎప్పుడు : నవంబర్ 18
ఎవరు : స్టెఫనోస్ సిట్సిపాస్
ఎక్కడ : లండన్ , బ్రిటన్
Published date : 19 Nov 2019 04:54PM

Photo Stories