ఏటీపీ–500 టోర్నీలో ఇండో–పాక్ ఎక్స్‌ప్రెస్ జోడీ
Sakshi Education
టెన్నిస్ సర్క్యూట్‌లో ‘ఇండో–పాక్ ఎక్స్‌ప్రెస్’గా గుర్తింపు పొందిన రోహన్ బోపన్న (భారత్), ఐజామ్ ఉల్ హఖ్ ఖురేషి (పాకిస్తాన్) మళ్లీ కలసి ఆడనున్నారు.
2021, మార్చి 15న మెక్సికోలో మొదలయ్యే అకాపుల్కో ఏటీపీ–500 టోర్నీలో బోపన్న–ఖురేషి ద్వయం తమ ఎంట్రీని ఖరారు చేసింది. దీంతో 2014లో షెన్‌జెన్ ఏటీపీ–250 టోర్నీ తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి ఆడనున్నారు. 2010లో బోపన్న–ఖురేషి జంట యూఎస్ ఓపెన్ డబుల్స్‌లో రన్నరప్‌గా నిలిచింది.
మెక్సికో రాజధాని: మెక్సికో సిటీ; కరెన్సీ: మెక్సికన్ పెసో
మెక్సికో ప్రస్తుత అధ్యక్షుడు: ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్
మెక్సికో రాజధాని: మెక్సికో సిటీ; కరెన్సీ: మెక్సికన్ పెసో
మెక్సికో ప్రస్తుత అధ్యక్షుడు: ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్
Published date : 03 Mar 2021 06:11PM