ఎస్వీబీసీ ఛైర్మన్ రాఘవేంద్రరావు రాజీనామా
Sakshi Education
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్(ఎస్వీబీసీ) ఛైర్మన్ పదవికి దర్శకుడు కె.రాఘవేంద్రరావు రాజీనామా చేశారు.

ఈ మేరకు తితిదే ధర్మకర్తల మండలి అధ్యక్షుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు మే 27న లేఖ రాశారు. 2018, ఏప్రిల్ 21న ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్‌గా రాఘవేంద్రరావు బాధ్యతలు స్వీకరించారు. తితిదే ధర్మకర్తల మండలిలోనూ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి వయోభారం కారణంగానే రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
Published date : 28 May 2019 06:48PM