ఎస్పీజీ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Sakshi Education
దేశంలోని ప్రముఖులకు రక్షణ కల్పించే స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) చట్టానికి చేసిన సవరణకు రాజ్యసభ డిసెంబర్ 3న ఆమోదం తెలిపింది.
ఈ బిల్లును లోక్ సభ నవంబర్ 27నే ఆమోదించింది. ఎస్పీజీ(సవరణ) బిల్లు-2019 ప్రకారం... ఇకపై దేశ ప్రధాని, అధికార నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు మాత్రమే ఎస్పీజీ రక్షణ వ్యవస్థ సేవలు అందుతాయి. బిల్లుపై జరిగిన చర్చలో హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ... ‘ప్రధానికి కేటాయించిన అధికారిక నివాసంలో ఉండే కుటుంబ సభ్యులకు ఐదేళ్లపాటు ఎస్పీజీ రక్షణ కల్పిస్తాం. అధికారం కోల్పోయిన రోజు నుంచి ఈ సేవలు నిలిపివేస్తారు’ అని వివరించారు.
మరోవైపు కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, దాద్రానగర్ హవేలీలను విలీనం చేసేందుకు ఉద్దేశించిన బిల్లును కూడా రాజ్యసభ ఆమోదించింది. లోక్‌సభ నవంబర్ 27న ఈ బిల్లును ఆమోదించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎస్పీజీ(సవరణ) బిల్లు-2019కు ఆమోదం
ఎప్పుడు : డిసెంబర్ 3
ఎవరు : రాజ్యసభ

Published date : 04 Dec 2019 05:42PM