Skip to main content

ఎస్‌బీఐతో ఐఎస్‌బీ అవగాహన ఒప్పందం

హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), భారతీయ స్టేట్ బ్యాంకుతో (ఎస్‌బీఐ) ఒక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) చేసుకుంది.
Current Affairsవిద్యా పరిశోధన, ప్రచురణ, సామర్థ్య కల్పన కార్యక్రమాల్లో ఇరు సంస్థలు సహకారం అందించుకోవడమే ఈ ఒప్పందం ఉద్దేశ్యమని ఐఎస్‌బీ పేర్కొంది. క్షేత్రస్థాయిలో ఎస్‌బీఐకి ఉన్న విశేష అనుభవాన్ని ఉపయోగించుకుంటూ, దానికి తమ అకడమిక్ నైపుణ్యాన్ని జోడించి పరిశోధనలు చేపట్టేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఐఎస్‌బీ డీన్ డాక్టర్ రాజేంద్ర శ్రీవాస్తవ వివరించారు. ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలో డిజిటల్ విప్లవాన్ని ఎస్‌బీఐ అందిపుచ్చుకున్న తీరును పరిశోధనాంశంగా చేపడతామని చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
భారతీయ స్టేట్ బ్యాంకుతో (ఎస్‌బీఐ) అవగాహన ఒప్పందం
ఎప్పుడు : జనవరి 24
ఎవరు : ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ)
ఎందుకు : విద్యా పరిశోధన, ప్రచురణ, సామర్థ్య కల్పన కార్యక్రమాల్లో పరిశోధనలు చేపట్టేందుకు
Published date : 25 Jan 2020 05:31PM

Photo Stories