Skip to main content

ఎస్‌బీఐ కార్డ్‌ సీఈఓగా అశ్వనీ తివారీ

దేశంలో రెండవ అతిపెద్ద క్రెడిట్‌ కార్డ్‌ ఇష్యూయర్‌ ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ అండ్‌ సీఈఓగా అశ్వనీ తివారీ బాధ్యతలు స్వీకరించారు. 2020, జూలై 31వ తేదీన బాధ్యతలు విరమించిన హర్‌దయాల్‌ ప్రసాద్‌ స్థానంలో తివారీ ఆగస్టు 4న కొత్త బాధ్యతలను చేపట్టారు.
Edu news

ఈ కొత్త బాధ్యతలకు ముందు ఆయన 2017 ఏప్రిల్‌ నుంచీ న్యూయార్క్‌ కేంద్రంగా ఉన్న ఎస్‌బీఐ యూఎస్‌ ఆపరేషన్స్ హెడ్‌గా పనిచేశారు. ఎస్‌బీఐ (కాలిఫోర్నియా) బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల వైస్‌ చైర్మన్ గా కూడా ఆయన పనిచేశారు.

అమెరికన్లకే ఉద్యోగాలు...
అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని దేశంలోని అన్ని ప్రభుత్వ సంస్థలను ఆదేశిస్తూ ఆగస్టు 4న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. విదేశీయులు, ముఖ్యంగా హెచ్‌1బీ వీసాదారులకు ఫెడరల్‌ ఏజెన్సీల్లో ఉద్యోగావకాశాలు కల్పించకూడదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎస్‌బీఐ కార్డ్‌ ఎండీ అండ్‌ సీఈఓగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : ఆగస్టు 4
ఎవరు : అశ్వనీ తివారీ
Published date : 05 Aug 2020 05:54PM

Photo Stories