Skip to main content

ఎఫ్‌ఎస్‌డీసీ 21వ సమావేశంలో నిర్మలా

న్యూఢిల్లీలో నవంబర్ 7న నిర్వహించిన ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్’ (ఎఫ్‌ఎస్‌డీసీ) 21వ సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దేశ ఆర్థిక రంగ పరిస్థితి, ఈ రంగంలో ఉన్న ఒత్తిళ్లు తదితర అంశాలపై సమీక్ష చేశారు. ఈ సమావేశానికి ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంతదాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్‌కుమార్, సెబీ చైర్మన్ అజయ్‌త్యాగి, ఐఆర్‌డీఏఐ చైర్మన్ సుభాష్‌చంద్ర కుంతియా హాజరయ్యారు. ఎఫ్‌ఎస్‌డీసీ అనేది ఆర్థిక రంగానికి సంబంధించి నియంత్రణ సంస్థల అత్యున్నత మండలి. దీనికి ఆర్థిక మంత్రి అధ్యక్షత వహిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎఫ్‌ఎస్‌డీసీ 21వ సమావేశం నిర్వహణ
ఎప్పుడు : నవంబర్ 7
ఎవరు : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : దేశ ఆర్థిక రంగ పరిస్థితిపై సమీక్షించేందుకు

మాదిరి ప్రశ్నలు
1. ‘ఆర్థిక రంగ స్థిరత్వం, అభివృద్ధి కౌన్సిల్’ (ఎఫ్‌ఎస్‌డీసీ) 21వ సమావేశం ఎక్కడ జరిగింది?
1. న్యూఢిల్లీ
2. ముంబై
3. హైదరాబాద్
4. తిరువనంతపురం
సమాధానం : 1

2. ఆర్థిక రంగానికి సంబంధించి నియంత్రణ సంస్థల అత్యున్నత మండలి అయిన ఎఫ్‌ఎస్‌డీసీకి ఎవరు అధ్యక్షత వహిస్తారు?
1. కేంద్ర హోం శాఖ మంత్రి
2. కేంద్ర ఆర్థిక మంత్రి
3. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
4. రాజ్యసభ చైర్మన్
సమాధానం : 2
Published date : 08 Nov 2019 05:59PM

Photo Stories