Skip to main content

ఎఫ్‌ఏఎన్‌ఎస్ సభ్యురాలిగా ఆర్ హేమలత

ఆసియా పోషకాహార సంఘాల సమాఖ్య (ఎఫ్‌ఏఎన్‌ఎస్) కార్యనిర్వాహక మండలి సభ్యురాలిగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) సంచాలకురాలు డా.ఆర్.హేమలత నియమితులయ్యారు.
2023 వరకు ఆమె పదవిలో కొనసాగుతారని ఎఫ్‌ఏఎన్‌ఎస్ ఆగస్టు 14న తెలిపింది. మండలి సభ్యురాలిగా.. పోషకాహార విభాగంలో పరిశోధన, శిక్షణ, సభ్య దేశాల్లో అవగాహన కార్యక్రమాల నిర్వహణలో హేమలత పాల్గొనాల్సి ఉంటుంది. ఇండోనేసియాలోని బాలిలో తాజాగా జరిగిన సమావేశంలో నూతన సభ్యులను నియమించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఎఫ్‌ఏఎన్‌ఎస్ కార్యనిర్వాహక మండలి సభ్యురాలిగా నియామకం
ఎప్పుడు : ఆగస్టు 14
ఎవరు : డా.ఆర్.హేమలత
Published date : 15 Aug 2019 05:29PM

Photo Stories