Skip to main content

ఎఫ్‌ఐఐ-2019లో ప్రధాని నరేంద్ర మోదీ

సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో అక్టోబర్ 29న నిర్వహించిన భవిష్యత్ పెట్టుబడుల సదస్సు(ఎఫ్‌ఐఐ) 2019లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ... వచ్చే ఐదేళ్లలో 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలని నిర్దేశించుకున్న భారత్‌లో పెట్టుబడులకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని చెప్పారు. దేశ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలంటూ సౌదీ అరేబియా కంపెనీలను ఆహ్వానించారు. ఈ రంగంలో 100 బిలియన్ డాలర్లకు పైగా ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
  • మౌలిక రంగంపై రూ. 1.5 లక్షల కోట్ల డాలర్ల పెట్టుబడులు భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్రా రంగంలో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు అపార అవకాశాలు ఉన్నాయి.
  • నైపుణ్యాలను మెరుగుపర్చడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నాం.. వచ్చే 3-4 ఏళ్లలో 40 కోట్ల మందిని వివిధ రంగాల్లో సుశిక్షితులుగా తీర్చిదిద్దనున్నాం.
  • భారత్, సౌదీ అరేబియా వంటి భారీ వర్ధమాన దేశాల దిశపైనే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి ఆధారపడి ఉంది.
  • జీ20 కూటమిలో.. అసమానతలు తగ్గించేందుకు, నిలకడగా అభివృద్ధిని సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై భారత్, సౌదీ అరేబియా కలిసి పనిచేస్తున్నాయి.
క్విక్‌ రివ్యూ :
ఏమిటి : భవిష్యత్‌ పెట్టుబడుల సదస్సు(ఎఫ్‌ఐఐ) 2019
ఎప్పుడు : అక్టోబర్‌ 29
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : రియాద్, సౌదీ అరేబియా
Published date : 30 Oct 2019 05:34PM

Photo Stories