Skip to main content

ఏపీలోని ఏ నగరంలో స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమం జరుగుతోంది?

చిత్తూరు జిల్లా తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ‘స్వర్ణిమ్ విజయ్ వర్ష్’ కార్యక్రమం జరుగుతోంది.
Current Affairs

ఫిబ్రవరి 18న ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాల అద్భుత విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఈ వేడుకలు జరగనున్నాయి.

కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ... పరమవీర చక్ర, అశోక్‌చక్ర, మహా వీర చక్ర, కీర్తి చక్ర, తదితర అవార్డు గ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న నజరానాకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మొత్తాన్ని పది రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించారు. 1971లో భారత్-పాక్ యుద్ధంలో విశేష సేవలందించిన మహా వీరచక్ర, పరమ విశిష్ట సేవా మెడల్ గ్రహీత, యుద్ధ వీరుడు రిటైర్డ్ మేజర్ జనరల్ సి.వేణుగోపాల్‌ను సీఎం సత్కరించారు.

భారత విజయానికి చిహ్నంగా...

  • 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో భారత విజయానికి చిహ్నంగా 2020, డిసెంబర్ 16న న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు విజయ జ్వాల(విక్టరీ ప్లేమ్)లను వెలిగించారు. ఇవి దేశ నాలుగు దిక్కులా ప్రయాణం చేశాయి. ఇండో - పాక్ యుద్ధంలో పాల్గొన్న ప్రతి సైనికుడిని కలిసి ‘యోధుడా సలాం’ అని పలకరిస్తూ వచ్చాయి.
  • దక్షిణాది రాష్ట్రాల్లో ప్రయాణం చేసిన విజయ జ్వాల ఫిబ్రవరి 17న తిరుపతికి చేరింది. రిటైర్డ్ మేజర్ జనరల్ వేణుగోపాల్ ఇంటి మీదుగా పోలీస్ పరేడ్ మైదానానికి చేరింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : స్వర్ణిమ్ విజయ్ వర్ష్ కార్యక్రమం నిర్వహణ
ఎప్పుడు : ఫిబ్రవరి 18 నుంచి 19 వరకు
ఎక్కడ : తిరుపతి, చిత్తూరు జిల్లా
ఎందుకు : దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత సాయుధ దళాల అద్భుత విజయానికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా
Published date : 19 Feb 2021 05:57PM

Photo Stories