Skip to main content

ఏపీలోని ఏ జిల్లాలో ట్రాన్సాసియా బయో మెడికల్స్‌ ఏర్పాటైంది?

ఆసియాలో అతిపెద్ద బయో మెడికల్స్‌ తయారీ కేంద్రంగా 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో నిర్మించిన ఇన్‌ విట్రో డయోగ్నొస్టిక్‌ (ఐవీడీ) కంపెనీ ‘ట్రాన్సాసియా బయో మెడికల్స్‌’ ప్రారంభమైంది.
Current Affairs
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి వర్చువల్‌ విధానంలో ఏప్రిల్‌ 13న ఈ కంపెనీని ప్రారంభించారు. రూ.30 కోట్ల పెట్టుబడితో ప్రారంభమైన ఈ కంపెనీలో... కోవిడ్‌–19 ఐజీజీ ఎలిసా టెస్ట్‌ కిట్స్, ఆర్టీపీసీఆర్‌ కిట్స్, ర్యాపిడ్‌ కిట్స్‌ వంటి వాటిని తయారు చేయనున్నారు.

కత్తి పద్మారావుకు లోక్‌నాయక్‌ పురస్కారం
2021 ఏడాది లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ పురస్కారాన్ని కవి, రచయిత, హేతువాద, దళితవాద ఉద్యమ నాయకుడు, సంఘ సంస్కర్త డాక్టర్‌ కత్తి పద్మారావుకు ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్‌ అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ట్రాన్సాసియా బయో మెడికల్స్‌ కంపెనీ ప్రారంభం
ఎప్పుడు : ఏప్రిల్‌ 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి
ఎక్కడ : విశాఖపట్నం మెడ్‌టెక్‌ జోన్‌
ఎందుకు : కోవిడ్‌–19 ఐజీజీ ఎలిసా టెస్ట్‌ కిట్స్, ఆర్టీపీసీఆర్‌ కిట్స్, ర్యాపిడ్‌ కిట్స్‌ వంటి వాటి తయారీ కోసం...
Published date : 15 Apr 2021 05:59PM

Photo Stories