Skip to main content

ఏపీలోని ఏ జిల్లాలో స్టీల్ క్లస్టర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది?

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లాలో భారీ స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Current Affairs
ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలశాఖ డెరైక్టర్ జవ్వాది సుబ్రమణ్యం జనవరి 13న తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పూర్ణోదయ ప్రాజెక్టు కింద విశాఖ నగరం సమీపంలో పూడిమడక వద్ద సుమారు వెయి్య ఎకరాల్లో స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి అవకాశాలను పెంచుకునే లక్ష్యంతో ఈ స్టీల్ క్లస్టర్ ఏర్పాటు కానుంది.

మరోవైపు అనంతపురంలో అపెరల్ పార్కు, చిత్తూరు జిల్లా నగరిలో టెక్స్‌టైల్ పార్కులతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఆటో, ఏరోస్పేస్, ఇంజనీరింగ్ వంటి పదిరంగాల్లో థీమ్ ఆధారిత పార్కులను అభివృద్ధి చేయడానికి కేంద్రం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారీ స్టీల్ క్లస్టర్‌ను ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : జనవరి 13
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : పూడిమడక, విశాఖపట్నం జిల్లా
ఎందుకు : తయారీ వ్యయాన్ని తగ్గించడం ద్వారా ఎగుమతి అవకాశాలను పెంచుకునే లక్ష్యంతో
Published date : 19 Jan 2021 06:10PM

Photo Stories