ఏపీలోని ఏ జిల్లాలో కృష్ణపట్నం పోర్టు ఉంది?
Sakshi Education
నెల్లూరు జిల్లా ముతుకూర్ మండంలో ఉన్న కృష్ణపట్నం పోర్టులో పూర్తిగా 100 శాతం వాటాను అదానీ గ్రూపు కైవసం చేసుకుంది.
ఇప్పటికే 75 శాతం వాటాను కలిగి ఉన్న అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ (ఏపీసెజ్) తాజాగా మిగిలిన 25 శాతం వాటాను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో విశ్వ సముద్ర హోల్డింగ్స్‌కు చెందిన 25 శాతం వాటాను రూ.2,800 కోట్లకు కొనుగోలు చేసినట్లు ఏపీసెజ్ ఏప్రిల్ 5న స్టాక్ ఎక్సే్ఛంజ్‌లకు తెలియచేసింది.
కట్టుపల్లి పోర్టు ఏ రాష్ట్రంలో ఉంది?
2025 నాటికి ఏపీసెజ్ నిర్వహణ సామర్థ్యం 500 మిలియన్ టన్నులకు తీసుకువెళ్లాలన్న లక్ష్యంతో తూర్పు తీర ప్రాంతంపై అదానీ గ్రూపు ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా తమిళనాడులో కట్టుపల్లి, ఎన్నోర్ పోర్టులను కొనుగోలు చేసిన అదానీ... ఏపీలోని కృష్ణపట్నం, గంగవరం పోర్టులను కొనుగోలు చేసింది. కృష్ణపట్నం పోర్టులో 100 శాతం వాటా కొనుగోలు రూ.14,800 కోట్లు వ్యయం చేయగా, గంగవరం పోర్టులో 89.6 శాతం వాటాను రూ.5554 కోట్లకు కొనుగోలు చేసింది.

- కట్టుపల్లి , ఎన్నోర్ పోర్టులు తమిళనాడులోని తిరువళ్ళూర్ జిల్లాలో ఉన్నాయి.
- ఎన్నోర్ పోర్టు పేరును కామరాజర్ పోర్టుగా మార్చారు.
Published date : 06 Apr 2021 06:21PM