ఏపీలోని ఏ జిల్లాలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ ప్రారంభమైంది?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో సూక్ష్మ, చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమ(ఎంఎస్ఎంఈ) టెక్నాలజీ సెంటర్ ఏర్పాటైంది.
20 ఎకరాల్లో రూ.133 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ సెంటర్‌ను కేంద్ర ఉపరితల రవాణా, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మార్చి 10న ఢిల్లీ నుంచి వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి ఎంఎస్‌ఎంఈ కేంద్ర సహాయమంత్రి ప్రతాప్‌చంద్ర సారంగి, విజయవాడ నుంచి ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు.
కార్యక్రమంలో మంత్రి మేకపాటి మాట్లాడుతూ... నౌకా నిర్మాణం, వెల్డింగ్, ఫాబ్రికేషన్, ఉక్కు ఉత్పత్తి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలున్న నేపథ్యంలో విశాఖలో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరుల(స్కిల్డ్ మ్యాన్‌పవర్)ను ఏటా 8,500 మంది చొప్పున రాబోయే ఐదేళ్లపాటు తీర్చిదిద్దడమే ఈ సెంటర్ ఏర్పాటు లక్ష్యమని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : కేంద్ర ఉపరితల రవాణా, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఇంజనీరింగ్ పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను తయారు చేసేందుకుకార్యక్రమంలో మంత్రి మేకపాటి మాట్లాడుతూ... నౌకా నిర్మాణం, వెల్డింగ్, ఫాబ్రికేషన్, ఉక్కు ఉత్పత్తి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలున్న నేపథ్యంలో విశాఖలో టెక్నాలజీ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంజనీరింగ్ పరిశ్రమలకు అవసరమైన నిపుణులైన మానవ వనరుల(స్కిల్డ్ మ్యాన్‌పవర్)ను ఏటా 8,500 మంది చొప్పున రాబోయే ఐదేళ్లపాటు తీర్చిదిద్దడమే ఈ సెంటర్ ఏర్పాటు లక్ష్యమని వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ ప్రారంభం
ఎప్పుడు : మార్చి 10
ఎవరు : కేంద్ర ఉపరితల రవాణా, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ
ఎక్కడ : విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్
Published date : 11 Mar 2021 05:28PM