ఏపీలోని ఏ జిల్లాలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు కానుంది?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు కానుంది.
డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ సునీల్ వాచని, సీఈవో పంకజ్ శర్మ మార్చి 9న క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిసి పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమ ద్వారా రెండు నుంచి మూడు వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు వివరించారు. కొప్పర్తి యూనిట్‌లో మొబైల్స్, వేరియబుల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, సెక్యూరిటీ ఎక్విప్‌మెంట్స్, కెమెరాలు తయారు చేయనున్నట్లు వెల్లడించారు. తిరుపతిలోని తమ యూనిట్‌ను విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని సీఎం జగన్‌కు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : త్వరలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్
ఎక్కడ : కొప్పర్తి, వైఎస్సార్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : త్వరలో డిక్సన్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ ఏర్పాటు
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : డిక్సన్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్
ఎక్కడ : కొప్పర్తి, వైఎస్సార్ జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 10 Mar 2021 06:12PM