ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి ముంపు బాధిత కుటుంబాలకు అదనంగా మరో రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని అందించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు.
పోలవరం ముంపు ప్రాంతాల్లో ఆగస్టు 8న ఏరియల్ సర్వే నిర్వహించి నష్టాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. వరద ప్రాంతాల్లో గిరిజన గ్రామాలే అధికంగా ఉన్నందున వారి జీవనోపాధి దెబ్బతినడంతో అదనంగా సాయాన్ని ప్రకటిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
ముఖ్యమంత్రి ప్రకటించిన సాయం వివరాలు...
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి ప్రకటించిన సాయం వివరాలు...
- పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న వారికి భోజనాలు, ముంపు బాధితులకు నిత్యావసర వస్తువుల పంపిణీతోపాటు అదనంగా రూ.5 వేల చొప్పున సాయం.
- కూలిన ఇళ్లు, పంట నష్టానికి నిబంధనల ప్రకారం పరిహారంతోపాటు అదనంగా ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం.
- ముంపు గ్రామాల్లో వెంటనే నిత్యావసర సరుకుల పంపిణీ.
- పంటలు కోల్పోయిన రైతులకు పరిహారంతోపాటు ఉచితంగా విత్తనాలు.
- పోలవరం కోసం సేకరించిన భూముల్లో సాగు చేసిన వారికి కూడా పరిహారం, ఉచితంగా విత్తనాల సరఫరా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో వరద బాధితులకు ఆర్థిక సాయం
ఎప్పుడు : ఆగ స్టు 8
ఎవరు : ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
Published date : 09 Aug 2019 05:57PM