ఏపీలో విద్యారంగ సంస్కరణలకు కమిటీ
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ సంస్కరణలకు 12మందితో కూడిన నిపుణుల కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) జేఎస్వీ ప్రసాద్ జూన్ 24న ఉత్తర్వులు జారీ చేశారు. బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ నేతృత్వంలోని ఈ కమిటీ 4 నెలల్లో తన నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో వసూలు చేస్తున్న ఫీజులను పరిశీలించి వాటి నియంత్రణకు ఈ కమిటీ సిఫార్సులు చేయనుంది. ప్రైవేట్ సంస్థల్లోని విద్యా ప్రమాణాలు, పరిస్థితులను కమిటీ పరిశీలించి రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుదలకు వీలైన సూచనలు చేయనుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ నేతృత్వంలో కమిటీ
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ సంస్కరణలకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రొఫెసర్ ఎన్.బాలకృష్ణన్ నేతృత్వంలో కమిటీ
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగ సంస్కరణలకు
Published date : 25 Jun 2019 05:49PM