ఏపీలో వైకుంఠపురం బ్యారేజీకి శంకుస్థాపన
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం వద్ద కృష్ణానదిపై నిర్మించతలపెట్టిన వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 13నశంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు తొలి ప్రాజెక్టుగా ప్రకాశం బ్యారేజీ నిర్మాణానికి ఫిబ్రవరి 13, 1954న శంకుస్థాపన చేశారని, సరిగ్గా 65 ఏళ్ల తర్వాత అదేరోజు వైకుంఠపురం బ్యారేజీకి శంకుస్థాపన చేస్తున్నామని అన్నారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్లు వెచ్చిస్తున్నామని పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : వైకుంఠపురం, అమరావతి, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైకుంఠపురం బ్యారేజీ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : వైకుంఠపురం, అమరావతి, ఆంధ్రప్రదేశ్
Published date : 14 Feb 2019 05:43PM