Skip to main content

ఏపీలో వైఎస్సార్ కంటి వెలుగు ప్రారంభం

ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని అక్టోబర్ 10న ఆంధ్రప్రదేశ్‌లో ‘వైఎస్సార్ కంటి వెలుగు’ పథకాన్ని ప్రారంభించారు.
అనంతపురంలోని జూనియర్ కాలేజీ గ్రౌండ్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. వైఎస్సార్ కంటి వెలుగు కింద మూడేళ్లపాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని 5.40 కోట్ల మందికి నేత్ర పరీక్షలతోపాటు అవసరమైన చికిత్సలను ప్రభుత్వం ఉచితంగా అందించనుంది. రాష్ట్రంలోని 62 వేల ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా కలెక్టర్లు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న టాస్క్‌ఫోర్స్ కమిటీలు జిల్లా స్థాయిలో కార్యక్రమాన్ని అమలు చేస్తాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వైఎస్సార్ కంటి వెలుగు పథకం ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : జూనియర్ కాలేజీ గ్రౌండ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించేందుకు
Published date : 10 Oct 2019 06:12PM

Photo Stories