ఏపీలో తొలిసారిగా కరోనాపై అధ్యయనం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్‌పై కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ) మైక్రో బయాలజీ విభాగంలో బయోఇన్ఫర్మాటిక్ అధ్యయనం చేశారు.
కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జెనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ (ఐజీఐబీ)తో కర్నూలు ప్రాంతం నుంచి 90 మంది కరోనా బాధితుల శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్(ఎన్‌జీఎస్) చేశారు. ఈ వివరాలను ఆగస్టు 12న కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ పి.చంద్రశేఖర్‌తో కలిసి మైక్రోబయాలజీ స్పెషలిస్టు డాక్టర్ పి.రోజారాణి విలేకరులకు వివరించారు. చైనాలోని వూహాన్‌లో మొదలైన కోవిడ్–19 వైరస్‌తో పోలిస్తే కర్నూలులో ఉన్న వైరస్ కొద్దిగా మార్పులు చేసుకుందని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఆరు ప్రతిష్టాత్మక సంస్థలు ఈ అధ్యయనంలో పాల్గొన్నాయి. ఏపీ నుంచి మొదటి అధ్యయనం ఇదే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో తొలిసారిగా కరోనాపై అధ్యయనం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ)
ఎక్కడ :కర్నూలుక్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో తొలిసారిగా కరోనాపై అధ్యయనం
ఎప్పుడు : ఆగస్టు 12
ఎవరు : కర్నూలు మెడికల్ కాలేజీ (కేఎంసీ)
Published date : 13 Aug 2020 05:37PM