Skip to main content

ఏపీలో తొలి దిశ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ‘దిశ’ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభమైంది.
Current Affairsతూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన తొలి దిశ పోలీస్‌స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 8న ప్రారంభించారు. అనంతరం నన్నయ వర్సిటీలో ‘దిశ’ చట్టంపై పోలీసు అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌లో పాల్గొని ‘దిశ యాప్’ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి, డీజీపీ గౌతం సవాంగ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ‘దిశ’ పోలీసుస్టేషన్ల ప్రత్యేకాధికారిణి దీపికాపటేల్ పాల్గొన్నారు.

దిశ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... మహిళలు, చిన్నారుల రక్షణే ధ్యేయంగా తీసుకువచ్చిన ‘దిశ’ చట్టం చరిత్రలో నిలిచి పోతుందని అన్నారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నామని, ఆ మేరకు 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తున్నామన్నారు. తిరుపతి, విశాఖలో కొత్తగా రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. 2020, ఫిబ్రవరి నెలాఖరులోగా రాష్ట్రంలో 18 దిశ పోలీసుస్టేషన్లు అందుబాటులోకి వస్తాయని చెప్పారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్‌లో తొలి ‘దిశ’ మహిళా పోలీస్‌స్టేషన్ ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 8
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా
Published date : 10 Feb 2020 05:43PM

Photo Stories