Skip to main content

ఏపీలో రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న తైవాన్ సంస్థ?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తైవాన్‌కు చెందిన పీఎస్‌ఏ వాల్సిన్ సంస్థ రూ.700 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది.
Current Affairs
ఈ పెట్టుబడితో చిత్తూరు జిల్లా ఈఎంసీ-2 లేదా వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని వైఎస్సార్ ఈఎంసీలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని నవంబర్ 6న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు.

విశాఖలో రీసెర్చ్ కేంద్రం...
నవంబర్ 6న ఏపీఐఐసీ కార్యాలయంలో రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై చెన్నైలోని తైపీ ఎకనామిక్ అండ్ కల్చరల్ సెంటర్ డెరైక్టర్ జనరల్ బెన్ వాంగ్ నాయకత్వంలో తైవాన్ కంపెనీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో అపార అనుభవం ఉన్న తైవాన్ విశాఖలో హైఎండ్ స్కిల్, అడ్వాన్స్ డ్ రీసెర్చ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చిందన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : రూ.700 కోట్ల పెట్టుబడులు
ఎప్పుడు : నవంబర్ 6
ఎవరు : తైవాన్‌కు చెందిన పీఎస్‌ఏ వాల్సిన్ సంస్థ
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్ ఏర్పాటుకు
Published date : 07 Nov 2020 06:02PM

Photo Stories