Skip to main content

ఏపీలో ప్రభుత్వ స్టేట్ డేటా సెంటర్‌లు ఎక్కడ ఏర్పాటు కానున్నాయి?

సైబర్ సెక్యూరిటీపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది.
Current Affairs
ఈ-గవర్నెన్స్ లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగిస్తున్న వెబ్‌సైట్లు, అప్లికేషన్ల నిర్వహణను ఏపీ టెక్నాలజీ సర్వీసెస్(ఏపీటీఎస్)కు బదలాయించడమే కాకుండా సొంతంగా స్టేట్ డేటా సెంటర్ (ఎస్‌డీసీ)ను ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.153.06 కోట్లతో ఏపీటీఎస్ రెండు చోట్ల ఎస్‌డీసీలను ఏర్పాటు చేస్తోంది. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.83.4 కోట్ల వ్యయంతో విశాఖపట్నంలో ప్రైమరీ సైట్‌ను, దీనికి అనుబంధంగా కడపలో రూ.69.67 కోట్లతో డిజాస్టర్ రికవరీ సైట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

అంతర్వేదిలో ముఖ్యమంత్రి...
తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవాలు ఫిబ్రవరి 19న ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉత్సవాల్లో పాల్గొన్నారు. 2020, సెప్టెంబరు 5న స్వామి వారి రథాన్ని దుండగులు దగ్ధం చేసిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :

ఏమిటి : త్వరలో ప్రభుత్వ స్టేట్ డేటా సెంటర్‌లు ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : విశాఖపట్నం, కడప
ఎందుకు : సైబర్ సెక్యూరిటీని మరింత పటిష్టం చేసేందుకు
Published date : 20 Feb 2021 05:56PM

Photo Stories