ఏపీలో నాణ్యమైన బియ్యం పంపిణీ ప్రారంభం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో శ్రీకాకుళం జిల్లా నుంచి పెలైట్ ప్రాజెక్టుగా ‘నాణ్యమైన బియ్యం పంపిణీ’ పథకానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుట్టారు.
శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో సెప్టెంబర్ 6న నిర్వహించిన బహిరంగ సభలో ముగ్గురు మహిళలకు నాణ్యమైన బియ్యం బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘రేషన్ షాపుల్లో తినగలిగే స్వర్ణ బియ్యాన్ని పంపిణీ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏప్రిల్ నుంచి 100 శాతం స్వర్ణ రకం బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం’ అని సీఎం అన్నారు.
సీఎం ప్రసంగంలోని అంశాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాణ్యమైన బియ్యం పంపిణీ’ పథకం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్
సీఎం ప్రసంగంలోని అంశాలు
- కిడ్నీ బాధితుల కష్టాలను దృష్టిలో ఉంచుకుని స్టేజ్ - 3 దశ నుంచే వారికి పెన్షన్‌ను అమలు చేయనున్నాం. వారికి ప్రత్యేక ప్యాకేజీ కింద నెలకు రూ.5 వేలు చొప్పున పింఛన్ అందచేస్తాం.
- దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల (సీకేడీ) బారిన పడ్డ ప్రతి 500 మంది రోగులకు ఒక హెల్త్ వర్కర్‌ను నియమిస్తాం.
- కిడ్నీ బాధితులతోపాటు సహాయకులకు కూడా ఉచితంగా బస్ పాస్ అందిస్తాం. కిడ్నీ రోగులకు ఉచితంగా ల్యాబ్ పరీక్షలతోపాటు నాణ్యమైన మందులు అందుబాటులోకి తెస్తాం.
- మత్స్యకార దినోత్సవం సందర్భంగా పడవలు, బోట్లు ఉన్న మత్స్యకారులకు రూ.10 వేల చొప్పున ఇవ్వబోతున్నాం.
- ఎస్టీ కుల ధ్రువీకరణకు వన్‌మ్యాన్ కమిషన్‌ను జేసీ శర్మ ఆధ్వర్యంలో నియమిస్తున్నాం. బుడగ జంగాల వాళ్ల సమస్యలనూ జేసీ శర్మ పరిగణనలోకి తీసుకుంటారు.
- సముద్రంలో వేటకు వెళ్లే ప్రతి మత్స్యకారుడికి రూ.10 వేలు ఇచ్చే కార్యక్రమాన్ని నవంబర్ 21న చేపట్టనున్నాం.
- వంశధారపై నేరడి వద్ద బ్యారేజి నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడతాం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నాణ్యమైన బియ్యం పంపిణీ’ పథకం ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 6
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : పలాస, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్
Published date : 10 Sep 2019 08:26PM