ఏపీలో నాలుగు శాస్త్రీయ పరిశోధన కేంద్రాలు
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో కొనసాగుతున్న కేంద్ర పరిశోధన కేంద్రాలు అక్కడికే పరిమితం కావడంతో రాష్ట్రంలో వీటి ఆవశ్యకత ఏర్పడింది. ఇక్కడి అవసరాలు తీర్చడానికి ఒక్క పరిశోధన కేంద్రం లేకపోవడంతో ఇతర రాష్ట్రాలపై ప్రభుత్వం ఆధారపడుతోంది. ఆ కేంద్రాల నుంచి నివేదికలు ఆలస్యం జరుగుతుండటంతో వీటి ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. పరిశోధన కేంద్రాలకు సంబంధించిన ప్రతిపాదనల రూపకల్పన బాధ్యతను సైన్స్ సిటీకి అప్పగించింది. ఈ మేరకు ప్రతిపాదనలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి వీటి ఆవశ్యకతను గుర్తించి సైన్స్ అండ్ టెక్నాలజీ కేంద్ర మంత్రిత్వ శాఖకు సెంటర్ ఫర్ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, సెంట్రల్ ఫుడ్ టెక్నాలాజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు.
టెక్నాలజీలో ముందంజలో ఉండాలనే..:
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో శాస్త్రీయ పరిశోధన కేంద్రాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో రాష్ట్రం ముందంజలో ఉండాలనే సీఎం జగన్ ఆశయానికి అనుగుణంగానే వీటిని రూపొందించాం. కేంద్రం వీటిని ఆమోదించి కేంద్రాల ఏర్పాటుకు అనుమతి ఇస్తుందని భావిస్తున్నాం.
- జయరామిరెడ్డి, సీఈవో, సైన్స్ సిటీ
క్విక్ రివ్వూ :
ఏమిటి :ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు శాస్త్రీయ పరిశోధన కేంద్రాలు ఏర్పాటు
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : సైన్స్ అండ్ టెక్నాలజీలో రాష్ట్రం ముందంజలో ఉండాలనే..