ఏపీలో మూడు వైద్య కళాశాలలకు అనుమతి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 7 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మూడు కాలేజీలకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అనుమతి ఇచ్చింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి అమిత్ బిశ్వాస్ మార్చి 20న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ పంపించారు. పాడేరు, గురజాల, మచిలీపట్నం వైద్య కళాశాలలకు అనుమతించారు. ఒక్కో కళాశాలకు రూ. 325 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేయగా ఇందులో 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం భరిస్తుంది. ఈ లెక్కన ఒక్కో కళాశాలకు కేంద్రం నుంచి రూ. 195 కోట్ల నిధులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ. 130 కోట్లు వ్యయం చేస్తుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో మూడు వైద్య కళాశాలలకు అనుమతి
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : పాడేరు, గురజాల, మచిలీపట్నం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో మూడు వైద్య కళాశాలలకు అనుమతి
ఎప్పుడు : మార్చి 20
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : పాడేరు, గురజాల, మచిలీపట్నం
Published date : 21 Mar 2020 05:59PM