ఏపీలో కొత్తగా వైఎస్సార్ కాపరి బంధు పథకం
Sakshi Education
రాష్ట్రంలోని గొర్రెల కాపరులకు ఆర్థిక సాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పథకాన్ని ప్రవేశపెట్టనుంది.
ఎన్‌సీడీసీ (నేషనల్ కో ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) ఆర్థిక సాయంతో ‘వైఎస్సార్ కాపరి బంధు’ పేరుతో కొత్త పథకాన్ని అమలు చేయనుంది. ఈ పథకం ద్వారా ఒక్కో లబ్ధిదారునికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు కొనుగోలు చేసేందుకు ఆర్థిక సాయం చేయనున్నారు. సంవత్సరానికి 12,500 మంది చొప్పున నాలుగు సంవత్సరాలకు 50 వేల మంది లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ఈ పథకాన్ని రూపొందించారు. ఎన్‌సీడీసీ ఈ పథకానికి తొలుత రూ.200 కోట్లు కేటాయించేందుకు అంగీకరించిందని అధికారులు తెలిపారు.
మరోవైపు యూనిట్ల కొనుగోలుకు ఎన్‌సీడీసీ మంజూరు చేసే రుణంలో 30 శాతం(ప్రస్తుతం 20 శాతం) సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. ఒక యూనిట్ (20 గొర్రెలు, ఒక పొట్టేలు) కొనుగోలుకు రూ.1.50 లక్షలు మంజూరు చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వైఎస్సార్ కాపరి బంధు పేరుతో కొత్త పథకం
ఎప్పుడు : మార్చి 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రాష్ట్రంలోని గొర్రెల కాపరులకు ఆర్థిక సాయం అందించేందుకు

Published date : 14 Mar 2020 05:47PM