Skip to main content

ఏపీలో గిరి ఆహార పోషణ పథకం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు పోషకాహారలోపాన్ని అధిగమించేందుకు ఉద్దేశించిన ‘గిరి ఆహార పోషణ’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిబ్రవరి 13న అమరావతిలో ప్రారంభించారు.
ఈ పథకంలో భాగంగా 6రకాల పోషకాలు ఉండే రూ.532 విలువైన ఆహారబుట్టను ఒక్కో గిరిజన కుటుంబానికి 2019, మార్చి 1వ తేదీ నుంచి ప్రతి నెలా ఉచితంగా అందించనున్నారు. ఇందుకోసం 2018-19 బడ్జెట్‌లో మొత్తం రూ.120 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ప్రస్తుతం బాలింతలు, చిన్నారులకు గిరి గోరుముద్దలు, అన్న అమృతహస్తం వంటి పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
గిరి ఆహార పోషణ పథకం ప్రారంభం
ఎప్పుడు : ఫిబ్రవరి 13
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
ఎందుకు : గిరిజనులు పోషకాహారలోపాన్ని అధిగమించేందుకు
Published date : 14 Feb 2019 05:40PM

Photo Stories