Skip to main content

ఏపీలో బాల సాహితీ సూచీ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ ‘బాల సాహితీ సూచీ’ పేరిట రూపొందించిన పిల్లల పుస్తకాల సమాచార దర్శినిని ఆంద్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్‌భవన్‌లో జనవరి 27న ఆవిష్కరించారు.
Current Affairs1963 నుంచి 2019 వరకు తెలుగులో విడుదలైన 6,150 పిల్లల పుస్తకాల ప్రాథమిక సమాచారాన్ని బాల సాహితీ సూచీలో పొందుపరిచారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. పుస్తక పఠనం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని, చిన్నారుల విద్యార్జనకు పరోక్షంగా సహాయపడుతుందని చెప్పారు. 1929లో శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ప్రచురించిన మొట్టమొదటి గ్రంథ పట్టికతో తెలుగులో గ్రంథ పట్టికల ప్రచురణ ప్రారంభమైందన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రశేఖర్ పాల్గొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బాల సాహితీ సూచీ ఆవిష్కరణ
ఎప్పుడు : జనవరి 27
ఎవరు : ఆంద్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్
ఎక్కడ : రాజ్‌భవన్, విజయవాడ
ఎందుకు : 1963 నుంచి 2019 వరకు తెలుగులో విడుదలైన 6,150 పిల్లల పుస్తకాల ప్రాథమిక సమాచారం కోసం
Published date : 28 Jan 2020 05:36PM

Photo Stories