ఏపీలో అవినీతి నిర్మూలనపై వీడియోల విడుదల
Sakshi Education
ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్ ఫ్రీ నంబర్‌పై ప్రచారానికి సంబంధించి బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు సందేశంతో రూపొందించిన ఇంగ్లిష్, తెలుగు భాషల్లోని వీడియోలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేశారు.
రాష్ట్ర సచివాలయంలో ఫిబ్రవరి 25న జరిగిన ఈ కార్యక్రమం నిర్వహించారు. ‘అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి సంకల్పం. ఎవ్వరైనా లంచం అడిగినా, అవినీతికి పాల్పడినా టోల్ ఫ్రీ నంబర్ 14400కు ఫిర్యాదు చేయండి. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి’ అని పీవీ సింధు ఈ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీలో అవినీతి నిర్మూలనపై వీడియోల విడుదల
ఎప్పుడు : ఫిబ్రవరి 25
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎందుకు : అవినీతి నిరోధానికి ఏర్పాటు చేసిన 14400 టోల్ ఫ్రీ నంబర్‌పై ప్రచారానికి

Published date : 26 Feb 2020 05:49PM