Skip to main content

ఏపీలో ఔట్‌సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పారదర్శకంగా ఎంపిక చేయడానికి ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్ (ఏపీసీవోఎస్) ఏర్పాటైంది.
ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 4న ఉత్తర్వులు జారీచేసింది. విజయవాడ కేంద్రంగా ఏర్పాటు చేసే ఏపీసీవోఎస్ తక్షణ కార్యకలాపాలు ప్రారంభించడానికి రూ.10 కోట్ల సీడ్ క్యాపిటల్‌ను ప్రభుత్వం సమకూర్చింది. ఈ కార్పొరేషన్ సబ్‌స్క్రిప్షన్ క్యాపిటల్ రూ.10 లక్షలుగా ఉంటుంది.

మొత్తం తొమ్మిది మంది బోర్డు సభ్యులతో ఏర్పాటైన ఏపీసీవోఎస్‌కు సాధారణ పరిపాలన విభాగం(సర్వీసెస్, హెచ్‌ఆర్‌ఎం)కు చెందిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి/ప్రధాన కార్యదర్శి/ప్రభుత్వ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఎటువంటి లాభాపేక్ష లేని ఈ సంస్థకు ఆదాయాన్ని వివిధ విభాగాల సంక్షేమ నిధుల నుంచి సమీకరిస్తారు. సమాన పనికి సమాన వేతనం అందేలా చూడడంతోపాటు దళారీ వ్యవస్థ లేకుండా పారదర్శకంగా, సమర్థులైన ఉద్యోగులను ఎంపిక చేయడం లక్ష్యంగా ఈ కార్పొరేషన్ ఏర్పాటైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్‌సోర్స్‌డ్ సర్వీసెస్ (ఏపీసీవోఎస్) ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : వివిధ ప్రభుత్వ శాఖల్లో అవసరమైన ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను పారదర్శకంగా ఎంపిక చేయడానికి
Published date : 05 Nov 2019 05:32PM

Photo Stories