Skip to main content

ఏపీలో ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్ ఆవిష్కరణ

భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్) విషయంలో అవినీతిరహిత, పారదర్శక, సులభతర, సత్వర సేవల దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది.
Current Affairsరిజిస్ట్రేషన్ దస్తావేజుల తయారీలో అవినీతి, దళారుల ప్రమేయం లేకుండా ఎవరి దస్తావేజులు వారే రాసుకునే పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) విధానాన్ని ఇటీవల అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తాజాగా ఆటోమ్యుటేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్‌ను ఫిబ్రవరి 11న సచివాలయంలో విడుదల చేశారు.

ప్రస్తుతం భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్ల నమోదు (మ్యుటేషన్) కోసం మీసేవ కేంద్రాలకు, తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తోంది. ఇకపై రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆ భూములను కొనుగోలుదారుల పేరుతో తాత్కాలికంగా నమోదు చేసేలా రిజిస్ట్రేషన్ అధికారులకు వీలు కల్పిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం - 1971’ను ప్రభుత్వం సవరించింది. దీంతో అధికారులే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మీభూమి పోర్టల్‌లో తాత్కాలిక ప్రాతిపదికన నమోదు చేస్తారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయం చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసి నెల రోజుల్లో శాశ్వత మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తుంది. ఈ భూమార్పిడి వివరాలను meebhoomi.ap.gov.in లో చూసుకునే సదుపాయాన్ని కల్పించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్ ఆవిష్కరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 11
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ సచివాలయం
ఎందుకు : భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్) విషయంలో అవినీతిరహిత, పారదర్శక, సులభతర, సత్వర సేవల కోసం
Published date : 12 Feb 2020 06:01PM

Photo Stories