Skip to main content

ఏపీలో 11,158 రైతు భరోసా కేంద్రాలు

రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి 11,158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు.
Current Affairsవిత్తనం దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు రైతుకు అవసరమైన సాయాన్ని ఈ కేంద్రాల ద్వారా తమ ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. ఇందుకోసం ప్రతి గ్రామ సచివాలయం పక్కనే రైతు భరోసా కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జనవరి 22న అసెంబ్లీలో రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుపై జరిగిన చర్చలో సీఎం ఈ మేరకు వివరించారు. ఈ కేంద్రాల ద్వారా నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల విక్రయంతో పాటు వ్యవసాయ సూచనలు, పండిన పంట కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు.

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ
రాజధాని అమరావతి భూముల కొనుగోళ్లలో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సమగ్ర విచారణ జరిపించాలంటూ ప్రవేశపెట్టిన తీర్మానానికి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జనవరి 22న ఆమోదం తెలిపింది. హోంమంత్రి మేకతోటి సుచరిత ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ భూ కుంభకోణంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ ప్రాథమికంగా 4,070 ఎకరాల్లో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగినట్టు నిర్ధారించి దీనిపై మరింత సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరముందని సూచించిందని తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
11,158 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
ఎందుకు : రైతులకు అన్ని విధాలా సాయం అందించేందుకు
Published date : 23 Jan 2020 05:48PM

Photo Stories