ఏపీకి నాలుగు పర్యాటక అవార్డులు
Sakshi Education
అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం(సెప్టెంబర్ 27) సందర్భంగా కేంద్ర పర్యాటక శాఖ జాతీయ అవార్డులను ప్రకటించింది.
పర్యాటక విభాగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ప్రకటించిన ఈ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు లభించాయి. పర్యాటక రంగం సమగ్రాభివృద్ధి విభాగంలో ఏపీకి జాతీయ ఉత్తమ రాష్ట్రం అవార్డు లభించింది. అలాగే పర్యాటక ప్రదేశాల సమగ్ర సమాచారంతో పర్యాటకుల హృదయాలను హత్తుకునే విధంగా ముద్రణ విభాగంలో రాష్ట్రానికి అవార్డు దక్కింది.
అదేవిధంగా ప్రయాణికుల భద్రత, సేవారంగంలో ఉత్తమ సేవలందిస్తున్న విశాఖపట్నం రైల్వే స్టేషన్‌కు స్నేహపూర్వక రైల్వే స్టేషన్‌గా అవార్డు దక్కింది. నాలుగు నక్షత్రాల హోటల్ విభాగంలో విజయవాడలోని క్వాలిటీ హోటల్ డి.వి.మానర్ అవార్డు పొందింది. ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో సెప్టెంబర్ 27న నిర్వహించిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పాటిల్ నుంచి ఏపీ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ ఉత్తమ రాష్ట్రం అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏపీకి నాలుగు పర్యాటక అవార్డులు
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : కేంద్ర పర్యాటక శాఖ
ఎందుకు : పర్యాటక విభాగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా

Published date : 28 Sep 2019 05:21PM